Jobs : ఈసీఐఎల్ లో ఉద్యోగ ఖాళీలు.. రూ.40,000 వేతనంతో..?
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఈ సంస్థ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం సిద్ధమైంది. 20 ప్రాజెక్ట్ ఇంజినీర్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు నోటిఫికేషన్ రిలీజ్ కాగా నిరుద్యోగులకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.
ఈఈఈ, ఈసీఈ, ఈఐఈ, మెకానికల్ విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది.
వాక్ ఇన్ ఇంటర్వ్యూల ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండగా 15, 16 తేదీలలో వాక్ ఇన్ ఇంటర్వ్యూలు జరగనున్నాయి. http://www.ecil.co.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. మొత్తం ఉద్యోగ ఖాళీలలో ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగ ఖాళీలు 12 ఉండగా 60 శాతం మార్కులతో ఈఈఈ, ఈసీఈ, ఈఐఈ, మెకానికల్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగా ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
60 శాతం మార్కులతో ఇంజినీరింగ్ పాసై మూడేళ్ల అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 2021 సంవత్సరం ఏప్రిల్ 30 నాటికి 30 ఏళ్లు మించని వాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 40,000 రూపాయల వేతనం లభిస్తుంది. అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగ ఖాళీలు 8 ఉండగా 25 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.
అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 30,000 రూపాయల వేతనం లభిస్తుంది. ఈ ఉద్యోగాల గురించి అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు విశాఖపట్నంలో ఉన్న ఈసీఐఎల్ రీజినల్ ఆఫీస్ లో జూన్ 15, జూన్ 16వ తేదీన జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది.
No comments