Latest

Loading...

Jobs : ఏపీ నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. టెన్త్, ఇంటర్ అర్హతతో 913 ఉద్యోగాలు.. చివరి తేదీ ఎప్పుడంటే.

Jobs


కరోనా కష్టకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభ్తుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించింది. ప్రభుత్వానికి చెందిన పంచాయతీ రాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ కడప జిల్లాలో ఖాళీగా ఉన్న గ్రామ, వార్డు వలంటీర్ల నియమానికి దరఖాస్తులు కోరుతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 913 వాలంటీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు పదవ తరగతి, ఇంటర్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వీరిని జిల్లా సెలక్షన్ కమిటీ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి జూన్ 6 చివరితేదీ. మరిన్ని వివరాలను https://gswsvolunteer.apcfss.in/ లేదా https://apgv.apcfss.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.


*ఈ ఉద్యోగాలకు పదవ తరగతి, ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి.

*అలాగే స్థానికంగా నివాసం ఉండాలి.

*ప్రభుత్వ పథకాల మీద పూర్తి అవగాహన ఉండడమే కాకుండా.. ప్రభుత్వం అనుసరిస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై పరిజ్ఞానం ఉండాలి.

*కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, సాఫ్ట్‌ స్కిల్స్‌ అవసరం. తెలుగు రాయడం, చదవడం తెలిసుండాలి.

*ఈ ఉద్యోగాలకు అప్లే చేసేవారి వయసు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

*ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఇంటర్వ్యూ 100 మార్కులకు ఉంటుంది. ఇందులో ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలపై అవగాహనకు 25 మార్కులు, ప్రభుత్వ సంక్షేమ విభాగాలు, సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న అనుభవానికి 25 మార్కులు.. నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌కు 25 మార్కులు; సాఫ్ట్‌ స్కిల్స్‌కు 25 మార్కులు ఉంటాయి.

జూన్ 6 లోపు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

No comments

Powered by Blogger.