Latest

Loading...

Kids food కిడ్స్ ఫుడ్ మెనూలో ఇవి ఉండాల్సిందే...!.

 

Kids foodపెద్ద వాళ్ళు తీసుకునే ఆహారానికి, చిన్నారులతినే ఫుడ్ మెనూ కు చాలా తేడా ఉంది. ఒకవేళ అదే ఆహారం చిన్నారులకు తినిపిస్తే అంతగా జీర్ణం కాకపోవచ్చు. అందుకోసమే పిల్లల కోసం ప్రత్యేకంగా ఫుడ్ మెనూ ఉండాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో ఉండే సహజ సిద్ధమైన పదార్థాలు పిల్లలకు రోజూ తినిపిస్తే చాలు.. వాళ్ళను వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు. పిల్లలకు సహజంగానే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అందుకనే వారికి త్వరగా వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా సీజన్‌ మారినప్పుడు దగ్గు, జలుబు, జ్వరం వస్తుంటాయి. కాబట్టి మన ఇంట్లో సహజంగా దొరికే కొన్ని పదార్ద్జాలను తినిపించడం వల్ల వారి రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధులు రాకుండా ఉంటాయి.

బాదం పప్పులో విటమిన్ ఇ, మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల అభివృద్ధికి, పెరుగుదలకు చాలా ముఖ్యమైనవి.


కాబట్టి ఎదుగుతున్న పిల్లలకు ఇవి చాలా అవసరం. ప్రతిరోజూ కొన్ని బాదం పప్పులు ఇవ్వడం వల్ల మీ పిల్లల శరీరానికి చాలా మంచిది. దీని వల్ల పిల్లలకి కావాల్సిన పోషకాలన్ని అందుతాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగాలంటే ప్రోబయోటిక్స్ ఉన్న ఆహారాలని తీసుకోవాలి. పెరుగులో ప్రోబయోటిక్స్ సమృద్దిగా ఉంటుంది. కానీ పెరుగును చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. ముఖ్యంగా చిన్నారులకు నిత్యం పెరుగును కచ్చితంగా తినిపించాలి. దీంతో వారి శరీరంలో ఉండే చెడు బాక్టీరియా నశిస్తుంది. పెరుగులో ఉండే కాల్షియం పిల్లల ఎముకలను దృఢంగా చేస్తుంది. అందుకే పెరుగును ప్రతి రోజూ ఒక కప్పు తినిపించాలి.


పెరుగు జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చేస్తుంది. ఆరెంజెస్, నిమ్మరసం, గ్రేప్ ప్రూట్స్, బెర్రీస్ ఈ పండ్లు అన్నిటిని కూడా సిట్రస్ ఫ్రూట్స్ అంటారు. ఇవి శరీర ఆరోగ్యానికి అద్భుతంగా సహాయపడుతాయి. సిట్రస్ ఫ్రూట్స్‌లో విటమిన్ సితో పాటు ముఖ్యమైన న్యూట్రీషన్స్ కూడా ఉంటాయి. విటమిన్ సి వ్యాధుల బారిన పడకుండా రోగనిరోధకతను పెంచడానికి, వ్యాధులతో పోరాడటానికి సాయపడుతుంది. అంతేకాదు ఇన్ఫెక్షన్ నియంత్రణలో ఉపడుతుంది. అందుకే మీ పిల్లల ఆహారంలో సిట్రస్ ఫ్రూట్స్ కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి.



No comments

Powered by Blogger.