Latest

Loading...

Leopard ఇంట్లోంచి బాలికను ఎత్తుకెళ్లి చంపిన చిరుత...

Leopard


ఓ నాలుగేండ్ల చిన్నారి ఆదా షకీల్ గురువారం సాయంత్రం వరకు ఇంటి పరిసరాల్లోనే ఆడుకుంటూ కనిపించకుండా పోయింది. దీంతో కంగారుపడ్డ బాలిక తల్లిదండ్రులు రాత్రి వరకు వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. శుక్రవారం ఉదయం గాలించగా ఇంటికి సమీపంలోని అటవీ ప్రాంతంలో శవమై కనిపించింది. ఈ ఘటన జమ్ముకశ్మీర్ రాష్ట్రంలోని బుద్గామ్ జిల్లాలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, అటవీ అధికారులు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. బాలిక మృతదేహంపై ఉన్న గాయాలను పరిశీలించి చిరుతపులి దాడిలో ఆ చిన్నారి చనిపోయినట్లు నిర్ధారించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత అటవీ సిబ్బంది చిరుతపులి జాడ కోసం గాలింపు చేపట్టారు.

కాగా, తమకు చిరుతపులుల బెడద లేకుండా చర్యలు చేపట్టాలని స్థానికులు అటవీ అధికారులను కోరారు.

No comments

Powered by Blogger.