LIC New plans :150 రూపాయలతో ఎల్ఐసీ అదిరిపోయే పాలసీ ఇదే....!!
కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే.. చాలా మంది బ్రతుకులు రోడ్డున పడ్డాయి. డబ్బులను పొదుపు చెయ్యడమో లేదా డబ్బులను సంపాదించడం ఎలా అనే ఆలోచనలో జనాలు ఉన్నారు. ఇక ప్రభుత్వ భీమా సంస్థలు కూడా కొత్త పాలసీలను అందిస్తుంది. ప్రముఖ భీమా కంపెనీ అయిన ఎల్ఐసీ ఇప్పటికే ఎన్నో పాలసీలను అందిస్తూ వస్తుంది. తాజాగా మరో కొత్త పాలసీని ప్రవేశ పెట్టింది.
ఆ పాలసీకు 150 కడితే 20 లక్షలు వస్తాయని అంటున్నారు. ఆ పాలసీ పూర్తి వివరాలను ఒకసారి తెలుసుకుందాం..అందిస్తున్న పలు రకాల స్కీమ్ లలో ఇది ఒకటి.. అదే జీవన్ లాభ్ పాలసి .. ఈ పాలసీ వల్ల ఆర్థిక లాభాలను పొందవచ్చు.. దాంతో పాటుగా సేవింగ్స్ కూడా ఉన్నాయి.
రెండు రకాల ప్రయోజనాల ను పొందవచ్చు. మరో విషయమేంటంటే పాలసీదారుడు మరణిస్తే.. అతని పేరు మీద ఉండే డబ్బులు అతని నామిని కి చెందుతాయి.
16 ఏళ్లు లేదా 21 ఏళ్లు లేదా 25 ఏళ్ల కాల సమయం ఉన్న పాలసీని తీసుకోవాలి. 16 ఏళ్ల పరిమితి ఉన్న పాలసీ తీసుకుంటే 10 ఏళ్ళు ప్రీమియం కట్టాలి. అలాగే 21 ఏళ్ల ప్రీమియం తీసుకుంటే 15 ఏళ్ళు కట్టాలి. రోజు కు రూ.150 ఆదా చేసి నెలకు దాదాపు రూ.4500 ప్రీమియం కడితే మంచి బెన్ఫిట్ ఉంటుంది. మెచ్యూరిటీ తర్వాత చేతికి రూ.20 లక్షలు లభిస్తాయి. పది లక్షలు భీమా, పది లక్షలు పాలసీ లభిస్తుంది. 8 నుంచి 59 ఏళ్ల లోపు వయసు ఉన్న వారు పాలసీ లో చేరవచ్చు. ఈ పాలసీ లో చేరిన మూడేళ్ళ తర్వాత పాలసీ పై లోన్ కూడా తీసుకోవచ్చు.. చూసారుగా మంచి ఆఫర్ కదా.. మీకు నచ్చినట్లయితే మీరు చేరండి.. లాభాలను పొందండి..
No comments