Lord krishna శ్రీ కృష్ణుడు తలపై నెమలి పింఛము ధరించడానికి గల కారణాలేంటి?
శ్రీ కృష్ణుడు అనగానే మనకి మొదట గుర్తొచ్చేది పదహారువేలమంది గోపికలతో సంభంధం ఉన్న వ్యక్తిగా గుర్తొస్తాడు. చక్కటి రూపం, నగుమోము, తలపై నెమలి పించం ధరించి సమ్మోహన భరితమైన రూపంతో చూడగానే ఎటువంటి వారినైనా ఆకర్షించగల రూపం కన్నయ్య సొంతం. అయితే కృష్ణుడు ప్రత్యేకించి నేమలిపించాన్ని ధరించడానికి గల కారణం. సృష్టిలో పవిత్ర ప్రాణి నెమలి మాత్రమే. శ్రీకృష్ణునికి పదహారు వేల మంది గోపికలు. అన్ని వేల మంది భామలతో సరససల్లాపాలు మాత్రమే చేశాడు. అల్లరి చేసి ఆడాడు. అంతవరకే మెలిగాడు. ఆ విషయం తెలియచేయటమే శ్రీకృష్ణునికి తలపై నున్నా నెమలి పించం భావము. శ్రీకృష్ణుడు కొంటెవాడు మాత్రమే. అయితే శ్రీకృష్ణుడు భోగీగా కనిపించే యోగీశ్వరుడు.
పదహారువేలమంది గోపికలతో పవిత్ర స్నేహముతో సన్నిహితంగా ఉన్నానని పదే పదే చెప్పడమే నెమలి పించాన్ని ధరించడం. నెమలి ఎంతో పవిత్రమైనది. అందుకే ఈనాడు మనం నెమలిని జాతీయ పక్షిగా అంగీకరించి గౌరవిస్తున్నాము.
No comments