LPG Gas Subsidy: ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీ బ్యాంక్ ఖాతాలో జమ కావడం లేదా.. అయితే ఇలా చేయండి..!!.
గ్యాస్ సిలిండర్లపై ఎల్పీజీ సబ్సిడీ కేంద్రం ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రతీ ఒక్కరూ ఏడాదికి 12 సిలిండర్లను సబ్సిడీ కింద తీసుకోవచ్చు. అయితే మొదట సిలిండర్ ఎంత అమౌంట్ ఉంటుందో ఆ మొత్తం మనం కట్టాల్సి ఉంటుంది. తర్వాత.. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీం కింద సబ్సిడీ మొత్తాన్ని సరాసరి కస్టమర్ ఖాతాలోకి ప్రభుత్వం జమ చేస్తూ వస్తోంది
అయితే చాలామందికి సబ్సిడీ అమౌంట్ అకౌంట్లలో జమ కావడం లేదంటూ ఫిర్యాదులు వస్తుంటాయి.
వాళ్లు దాని కోసం ఏం చేయాలో అర్థం కాదు. వాళ్లు కింద చెప్పిన విధంగా చేస్తే డబ్బులు అకౌంట్లలో జమ అవుతాయి.
మీ బ్యాంక్ లో డబ్బులు జమ కాకపోతే ముందుగా మీ యొక్క కంపెనీకి సంబంధించి ఎల్పీజీ గ్యాస్ ప్రొవైడర్ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అంతేకాకుండా టోల్ ఫ్రీ నంబర్ 18002333555కు కాల్ చేసి ఫిర్యాదును నమోదు చేసుకోవచ్చు.
అసలు మన బ్యాంక్ ఖాతాలోకి సబ్సిడీ మొత్తం వస్తోందో లేదోనన్న విషయాన్ని తెలుసుకోవాలంటే.. మొదటగ www.mylpg.in వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి.. కుడివైపు కనిపిస్తున్న సిలిండర్ కంపెనీ పై క్లిక్ చేయాలి తర్వాత మరో పేజి ఓపెన్ అవుతుంది
అందులో అక్కడ టాప్ రైట్ కార్నర్లో సైన్-ఇన్, న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అనే రెండు ఎంపికలు ఉంటాయి. ఐడీ ఉంటే సైన్-ఇన్.. లేకపోతే రిజిస్టర్ కావాల్సి ఉంటుంది.
లాగిన్ అయిన తర్వాత View Cylinder Booking History ఆప్షన్‌ను ఎంపిక చేస్తే.. మనకు ఎంత సబ్సిడీ వస్తుందో అందులో కనిపిస్తుంది
ఒక వేళ గ్యాస్ సబ్సిడీ రాకపోతే Feedback Here ఆప్షన్ నొక్కి ఫిర్యాదు చేయాలి లేదా టోల్ ఫ్రీ నంబర్ 18002333555కు కాల్ చేసి కూడా ఫిర్యాదు చేయవచ్చు
సబ్సిడీ రాకపోవడానికి ఆధార్ లింకింగ్ (ఎల్పిజి ఆధార్ లింకింగ్) కూడా కారణం కావచ్చు.
అందుచేత వెంటనే మీ డిస్ట్రిబ్యూటర్ దగ్గరకు వెళ్లి ఆధార్‌ను లింక్ చేసుకోవాలి.
ఇవన్నీ కాకుండా మన బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ నంబర్ లింక్ అయి ఉండాలి. లేదంటే సబ్సిడీ బ్యాంక్ ఖాతాలో జమ కాదు
No comments