Latest

Loading...

Nails health చేతిగోళ్లను చూసి ఆరోగ్య సమస్యలు తెలుసుకోవచ్చు.. ఎలా అంటే..?

Nails health

 మనలో చాలామంది సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నామని భావిస్తూ ఉంటాం. అయితే మనకు తెలియకుండానే మనల్ని ఎన్నో ఆరోగ్య సమస్యలు వేధిస్తూ ఉంటాయి.


సాధారణంగా రక్త పరీక్షల సహాయంతో ఆరోగ్య సమస్యల గురించి సులభంగా తెలుసుకోవచ్చు. అయితే చేతి గోళ్లను పరిశీలించడం ద్వారా కూడా ఆరోగ్య సమస్యలను తెలుసుకోవడం సాధ్యమవుతుంది. ఆశ్చర్యంగా అనిపించినా వైద్య నిపుణులు సైతం చేతి గోళ్ల ద్వారా ఆరోగ్య సమస్యలు తెలుసుకోవచ్చని చెబుతున్నారు.


సాధారణంగా గోళ్లు ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటాయి. కొందరి గోళ్లు ఎంతో మృదువుగా ఉంటే మరి కొందరి గోళ్లు మాత్రం రఫ్ గా ఉంటాయి. ప్రతి ఒక్కరి చేతివేళ్లపై అర్ధచంద్రాకారంలో ఒక గుర్తు ఉంటుంది. ఈ గుర్తును లునులా అని పిలుస్తారు. ఈ లునులా దెబ్బ తింటే కొంతమంది గోళ్ల పెరుగుదల కూడా ఆగిపోయే అవకాశాలు అయితే ఉంటాయి. చేతిగోళ్లపై ఎవరికైతే లూనులా ఉండదో వాళ్లు రక్తహీనత, పౌష్టికాహార లోపంతో బాధ పడుతున్నట్టు అర్థం చేసుకోవాలి.


ఈ సమస్యలను అధిగమించడానికి తీసుకునే ఆహారపదర్థాలలో కూడా మార్పులు చేసుకుంటే మరీ మంచిది. లునులాపై ఎరుపు, పసుపు పచ్చ రంగులు వుంటే మాత్రం వాళ్లకు ఇతరులతో పోలిస్తే గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లునులా నీలిరంగులో ఉంటే మాత్రం డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.


లునులా మరీ చిన్నగా ఉంటే మాత్రం శరీరంలో విష పదార్థాలు ఎక్కువగా పేరుకుపోతున్నాయని అర్థం చేసుకోవాలి. గోళ్లపై లునులా లేని వాళ్లు వైద్యులను సంప్రదిస్తే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. గోళ్లు తెల్లగా ఉంటే మంచిదని గోళ్లు తెల్లగా లేకపోయినా వైద్యులను సంప్రదించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు

No comments

Powered by Blogger.