Latest

Loading...

New treatment for covid 19 కోవిడ్‌కు కొత్త చికిత్స- మూడు రోజుల్లో కోలుకుంటారు!

New treatment for covid 19

 హైదాబాద్‌కు చెందిన AIG హాస్పిటల్స్ కరోనాకు కొత్త చికిత్సను అందుబాటులోకి తెచ్చింది. అదే యాంటిబాడీ కాక్‌టైల్‌. ఈ పద్ధతిలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు చికిత్స చేశారు. ఈ చికిత్సకు సంబంధించి పూర్తి స్థాయి రుజువులు నిర్దారణ కాకున్నా.. వివిధ వైద్య సంఘాలు ఈ తరహా చికిత్సను ప్రోత్సహిస్తున్నాయని AIG హాస్పిటల్స్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ డి నాగేశ్వరరెడ్డి అన్నారు. మోనొక్లొనల్‌ యాంటిబాడీస్‌ లేదా యాంటిబాడీ కాక్‌టైల్‌ చికిత్సలో వైరస్‌లోని ప్రొటీన్స్‌ను ఒకదానితో మరొకదాన్ని బంధించడం వల్ల వాటికి ప్రతిరూపాలను చాలా వరకు తగ్గించవచ్చన్నారు. దీనివల్ల కరోనా పేషెంట్లు మూడు రోజుల్లో కోలుకునే అవకాశముంటుంది.


అయితే చికిత్స ఖర్చు రూ. 70,000 అవుతుందని ఆయన అన్నారు. కరోనాకు ఈ చికిత్స విధానం పనిచేస్తున్నా.. ఇపుడు మన దేశంలో భారీగా విస్తరించిన డబుల్‌ మ్యూటెంట్‌ B.1.167కు ఇది కచ్చితంగా పని చేస్తుందని చెప్పలేమని అన్నారు. అలాగే ఈ చికిత్సా విధానం వల్ల మరో మ్యూటెంట్‌ వేరియంట్స్‌ తయారయ్యే అవకాశం కూడా ఉందని ఆయన హెచ్చరించారు. యాంటిబాడీ కాక్‌టైల్‌ చికిత్స తరవాత వ్యాక్సిన్‌ వేసుకోవడానికి కనీసం మూడునెలలు వేచి ఉండాలని డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి అన్నారు.

No comments

Powered by Blogger.