Latest

Loading...

No Mask జూన్ 28 తర్వాత అక్కడ నో మాస్క్...!!

No Mask

 కరోనా వేరేవైరస్ సమయంలో ప్రస్తుతం మాస్క్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ఒకప్పుడు దుమ్ము ధూళి నుంచి కాపాడుకోవడానికి మాస్క్ పెట్టుకునే వారు. కొంతమంది మాస్క్ పెట్టుకోడానికి చిరాకు పడే వారు. కానీ ఇక ఇప్పుడు మాస్క్ పెట్టుకోకపోతే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అన్న భయంతో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్క్ ధరిస్తున్నారు. కేవలం ఒక దేశంలో కాదు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో కూడా మాస్క్ ధరించడం అనేది తప్పనిసరిగా మారిపోయింది.


అయితే మొన్నటి వరకు అన్ని దేశాల ప్రభుత్వాలు ఇక బహిరంగ ప్రదేశాల్లో తప్పని సరిగా మాస్క్ ధరించాలి అంటూ నిబంధన విధించాయ్. ఇక మాస్కు వేసుకోకుండా ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు కూడా తీసుకున్నారు.

కానీ గత కొంత కాలం నుంచి కొన్ని దేశాలు వైరస్ నుంచి బయట పడుతున్నాయ్. దీంతో మాస్క్ ధరించడం తప్పని సరి నిబంధనలు ఎత్తివేస్తూ వస్తున్నాయి కొన్ని దేశాలు. ఇటీవలే మరో దేశం కూడా ఇలా మాస్కు తప్పని సరి కాదు అని నిబంధన ఎత్తివేసిన దేశాల జాబితాలో చేరింది.


కరోనా వైరస్ తీవ్రంగా ఉండి.. వైరస్ ప్రభావం తో అల్లాడి పోయిన దేశాల్లో ఇటలీ కూడా ఒకటి. అయితే అక్కడ వైరస్ నియంత్రణకు ఎంతో సమర్థవంతం గా చర్యలు చేపట్టడం తో ఇక ప్రస్తుతం ఇటలీ వైరస్ నుంచి బయట పడుతుంది. మొదట్లో కోట్లల్లో కేసులు,లక్షల మరణాలు నమోదు కాగా ప్రస్తుతం వైరస్ కేసులు మరణాలు పూర్తిగా తగ్గి పోయాయ్. దీంతో ఇక దేశం లో మాస్క్ ధరించడం తప్పనిసరి అనే నిబంధన తొలగించేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. జూన్ 28 తర్వాత ఈ నిబంధన తొలగిపోతుందట. అయితే భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాల నుంచి తమ దేశానికి వచ్చే ప్రయాణికులపై మాత్రం నిషేధాజ్ఞలు తొలగించలేదు ఇటలీ.

No comments

Powered by Blogger.