Latest

Loading...

Novavax: జులైలో పిల్లలపై 'సీరమ్‌' ట్రయల్స్‌...?



Novavax

నోవావాక్స్‌ టీకాను పిల్లలపై ప్రయోగించేందుకు పుణెలోని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) ప్రయత్నాలు చేస్తోంది. జులైలో క్లినికల్‌ ట్రయల్స్‌ చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. కరోనా నివారణలో తమ టీకా 90.4శాతం ప్రభావవంతంగా పనిచేస్తుందని, కొత్త వేరియంట్లనూ అడ్డుకోగలదని అమెరికాకు చెందిన నోవావాక్స్‌ కంపెనీ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్న 'సీరమ్‌' సెప్టెంబర్‌ కల్లా భారత్‌లో ఈ టీకాను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే హైదరాబాద్‌కు చెందిన ఫార్మా దిగ్గజ సంస్థ భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌, అలాగే జైడస్‌ క్యాడిలా సంస్థ అభివృద్ధి చేసిన జైకోవ్‌-డి వ్యాక్సిన్లు చిన్నారులపై క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే.


No comments

Powered by Blogger.