Latest

Loading...

Papaya Seeds: బొప్పాయిపండును తిని.. గింజలు పడేస్తున్నారా.. వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా....!

Papaya Seeds

Papaya Seeds: బొప్పాయి మంచి ఔషధాల గని. బొప్పాయి పండుగా తింటారు.. మరికొందరు పచ్చి బొప్పాయిని కూరగా చేసుకుంటారు. ఇక బొప్పాయి ఆకులు ఔషధగుణాలతో నిండి ఉంది. పెట్లెట్స్ తగ్గిన వారికీ ఈ బొప్పాయి ఆకుల రసాన్ని ఇస్తారు.. అయితే ఇప్పుడు బొప్పాయి పండులోని గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచివి అని అంటున్నారు. సర్వసాధారణంగా బొప్పాయి పండు తిని.. గింజలను పడేస్తాం.. అయితే ఆ గింజల వలన కలిగే ఆరోగ్య లాభాలు తెలిస్తే.. పడేసే ముందు ఆలోచిస్తారు..

మన శరీరానికి కావలసిన పోషకాలు ఈ బొప్పాయి పండు లో ఉన్నాయి. అంతే కాకుండా గింజల్లో ఇంకా మంచి పోషకాలు ఉన్నాయి. జీర్ణవ్యవస్థకు రక్తసరఫరాకు దంత సమస్యలకు బొప్పాయి పండు ఎంతగానో ఉపయోగపడుతుంది కేవలం బొప్పాయి పండు లోనే కాకుండా అందులోని విత్తనాలు కూడా మన ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. రోజూ పరగడుపున ఈ బొప్పాయి గింజలు తిన్నట్లయితే చాల రోగాలు దరిచేరవని నిపుణులు అంటున్నారు
రోజూ పరగడుపున ఈ బొప్పాయి విత్తనాలు తిన్నట్లయితే కడుపులో ఉండే విషపదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రపడుతుంది. కడుపులో ఉండే వ్యర్ధాలు తొలగిపోతాయి. జీర్ణాశయంలొ ఉండే క్రిములు నాశనమవుతాయి. దీంతో ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి.

ముఖ్యంగా మన కడుపులో ఉండే క్రిములు గింజలు తింటే నశిస్తాయి. బొప్పాయి పండులో ఉండే ఔషధ గుణాలు శరీర బరువును తగ్గిస్తాయి. ఒత్తిడిని తగ్గిస్తుంది. తరచుగా వచ్చే జ్వరం దగ్గు జలుబు వంటి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. ఇన్ని ప్రయోజనాలున్న బొప్పాయి గింజలను ఇక నుంచి పడేయకుండా తినడానికి ట్రై చేయండి.

 


No comments

Powered by Blogger.