PF Interest: పీఎఫ్ వడ్డీని ఎలా లెక్కిస్తారో తెలుసా..? ఫార్ములా ఇదే...!
ఇక ఈపీఎఫ్ వడ్డీ ఎలా లెక్కిస్తారో తెలుసుకోండి.
ఓ కంపెనీలో 20 కన్నా ఎక్కువ ఉద్యోగులు ఉంటే ఆ కంపెనీ ఉద్యోగుల పేరు మీద ఈపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేస్తుంది. ప్రతీ నెలా ఈపీఎఫ్ అకౌంట్లో డబ్బులు జమ చేస్తుంది. బేసిక్ వేతనంలో 12 శాతం వాటాను ఉద్యోగి జమ చేస్తే, 12 శాతం వాటాను యజమాని జమ చేస్తారన్న విషయం తెలిసిందే. అయితే యజమాని జమ చేస్తే 12 శాతం వాటాలో 8.33 శాతం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్‌లోకి, 3.67 శాతం ఈపీఎఫ్ అకౌంట్లోకి వెళ్తుంది. అంటే మొత్తం 24 శాతం ఈపీఎఫ్ఓకు వెళ్తుంది. దీనిపై వచ్చే వడ్డీని ప్రతీ ఏటా ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్ అకౌంట్లో జమ చేస్తుంది ఈపీఎఫ్ఓ. రూ.15,000 కన్నా తక్కువ బేసిక్ వేతనం ఉన్నవారికి ఈపీఎఫ్ అకౌంట్ తప్పనిసరి. అయితే అంతకన్నా ఎక్కువ వేతనం ఉన్నవారు ఫామ్ 11 డిక్లరేషన్ ఇచ్చి ఈపీఎఫ్ అకౌంట్లో డబ్బులు జమ చేయొచ్చు.
ఉదాహరణకు ఓ ఉద్యోగి బేసిక్+డీఏ రూ.15,000 అనుకుందాం. అందులో 12 శాతం ఉద్యోగి వాటా అంటే రూ.1800 ఈపీఎఫ్ అకౌంట్లో జమ చేయాలి. ఇక యజమాని 8.33 శాతం వాటాను అంటే రూ.1250 ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్‌లో జమ చేస్తారు. మిగతా 3.67 శాతం వాటా అంటే రూ.550 ఈపీఎఫ్ అకౌంట్లో జమ చేస్తారు. ఇందులో రూ.1250 ఈపీఎస్‌లోకి వెళ్తుంది కాబట్టి అది లెక్కించకూడదు. ఈపీఎఫ్ అకౌంట్లోకి వెళ్లిన మొత్తం రూ.1800+రూ.550. అంటే మొత్తం రూ.2,350. ప్రతీ నెలా ఇంతే మొత్తం ఈపీఎఫ్ అకౌంట్లో జమ అవుతూ ఉంటుంది. ఇక ఈపీఎఫ్ వడ్డీ 8.5 శాతం. అంటే నెలకు 0.7083%. ఈ లెక్కన రూ.2,350 ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్‌కు రూ.33.29 వడ్డీ వస్తుంది.
No comments