Latest

Loading...

PhonePe: ఫోన్ పే కస్టమర్లకు శుభవార్త.... సరికొత్తగా ఆటో టాప్ అప్ ఫీచర్.. దీని వల్ల ఉపయోగం ఏంటంటే..!

PhonePe

 PhonePe: ప్రముఖ డిజిటల్‌ పేమెంట్‌ ప్లాట్‌ ఫామ్‌ ఫోన్‌పే కొత్త ఫీచర్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది. గూగుల్‌పేతో పోటీ పడుతోంది. తాజాగా, ఫోన్​పే ‘వాలెట్ ఆటో టాప్​అప్’ అనే కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. యూపీఐ విధానాన్ని అనుసరించి ఈ కొత్త ఫీచర్​ను రోలవుట్​చేస్తోంది. ఈ ఫీచర్​ ద్వారా కస్టమర్లు తమ ఫోన్‌పే వాలెట్‌ను సులభంగా రీఛార్జ్​ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే ఫోన్​పే వాలెట్​లో అమౌంట్​ లేనట్లయితే ఆటోమేటిక్​గా బ్యాలెన్స్​ లోడ్​ అవుతుంది. తద్వారా, ఫోన్‌పే కస్టమర్లు ప్రతిసారీ వారి వాలెట్​ను మాన్యువల్‌గా లోడ్‌ చేసే ఇబ్బందులు తప్పుతాయి. అంతేకాదు ఈ ఆటో టాప్-అప్ ఆప్షన్ వినియోగదారుల సమయాన్ని ఆదా చేస్తుంది. సుదీర్ఘమైన ప్రాసెల్​లేకుండా సులభంగా వాలెట్ లోడ్​ చేస్తుంది.  కాగా, యూపీఐ ఈ-మ్యాన్​​డేట్ సెటప్​ చేసిన తర్వాత, కస్టమర్లు తమ వాలెట్‌ను లోడ్ చేయాలనుకున్న లేదా చెల్లింపులు చేయాలనుకున్న ప్రతిసారీ యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓటిపి కోసం వేచి ఉండాల్సిన అవసరం కూడా ఉండదు. వాలెట్​బ్యాలెన్స్​ జీరోకు పడిపోయినప్పుడు ఆటోమేటిక్​గా రీఛార్జ్​చేస్తుంది.


టాప్‌-ఆప్‌ను ఎలా ఉపయోగించాలంటే.

ముందుగా టాప్-అప్ ఐకాన్​పై క్లిక్​చేయండి. అప్పుడు, మీరు వాలెట్‌కు జోడించాల్సిన మొత్తం నమోదు చేసి టాప్​టాప్​ ప్రారంభించండి. ఉదాహరణకు మీరు ఆటో టాప్-అప్ వాలెట్​లో రూ .1,000 నుండి 5,000 రూపాయల వరకు లోడ్ చేయాలనుకుంటే.. మీ అమౌంట్​ను ఎంటర్​చేసి ‘టాప్-‘ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత స్క్రీన్ కింద ఉండే ఆటో టాప్-అప్ వాలెట్ ఆప్షన్​ను అప్ అండ్‌ సెట్ చేసుకోవాలి. యూపీఐ పిన్ ఎంటర్ చేసి.. మీ బ్యాంక్ ఖాతాను ధృవీకరించాలి. ఆ తరువాత, మీ ఫోన్‌పే వాలెట్ వెంటనే రీఛార్జ్ అయిపోతుంది. ఈ మొత్తాన్ని వివిధ రకాల బిల్లులు చెల్లింపులు, రీచార్జ్‌లకు ఉపయోగించుకోవచ్చు


కాగా, ఈ-మ్యాన్​డేట్​యూపీఐ ఫీచర్ డిజిటల్​పేమెంట్ సిస్టమ్‌లో ముందుంటుందని ఫోన్‌పే తెలిపింది. ఇది డిజిటల్​పేమెంట్ సిస్టమ్‌ను మరింతగా ప్రోత్సహిస్తుందని, డిజిటల్​పేమెంట్​బిజినెస్‌ రంగాల్లో ఎన్నో మార్పులను తీసుకువస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తున్న ఫోన్‌ పే మరింత మరింత మంది కస్టమర్లను చేర్చుకోగలదని తెలిపింది. అలాగే ఈ ఆటోపేమెంట్​ ఫెయిల్యూర్​అయ్యే అవకాశాలు చాలా తక్కువ. మిగతా మాన్యువల్​ పేమెంట్లతో పోలిస్తే ఇవి 99.99 శాతం సక్సెస్​ రేటు కలిగి ఉంటాయని తెలిపింది. ఫోన్‌ పే ద్వారా మీ మొబైల్​రీఛార్జ్, కరెంట్​బిల్లు, డిష్​ రీచార్జ్​, ఇన్సూరెన్స్​ రెన్యువల్​ వంటి​ ఇతర చెల్లింపుల సేవలు ఎన్నో ఉన్నాయి. కస్టమర్లకు మరిన్ని సులభమైన సేవలు అందించేందుకు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఫోన్‌ పే తెలిపింది.


No comments

Powered by Blogger.