Saneeswarudu మీలో ఈ సంకేతాలు కనిపిస్తే శని ప్రభావం ఉన్నట్లే ?
నవగ్రహాలలో ఏడవ వారైన శనీశ్వరుడు మానవుల జీవితాలపై చాలా ప్రభావం చూపుతారు అన్న విషయం తెలిసిందే. శనీశ్వరుడు సూర్య భగవానునికి మరియు ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి. శనీశ్వరుని ప్రభావం చేతనే మనకు శని పడుతుందని అందరూ అనే మాట. వాస్తవానికి మానవుల యొక్క కర్మలను బట్టి శనీశ్వరుని యొక్క ప్రభావం వారిపై ఉంటుంది. మంచి కర్మలను చేస్తే ప్రశాంతమైన జీవనం మరియు సంతోషం లభిస్తాయి. చెడు కర్మలను చేస్తే వారికి కష్టమైన జీవనం కలిగేలా శనిదేవుడు చేస్తాడు.
అయితే శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించే దయామూర్తిగా వరాలు అందిస్తారు. ఇక ఎవరిపైనా అయిబా శని ప్రభావం ఉందా అనే విషయం తెలుసుకోవడానికి మూడు భావాల ద్వారా తెలుసుకోవచ్చు అంటున్నారు పండితులు.
ఎవరైనా మునుపెన్నడూ లేని విధంగా మద్యపానం లేదా మాంసం ఎక్కువగా తీసుకునే అలవాటు ఉంటే, మీపై ఖచ్చితంగా శని ప్రాభవం ఉందాహాని అర్ధం చేసుకోండి. ఇటువంటి సమయంలో మీరు ఈ చేదు అలవాట్లకు దూరంగా ఉండడమే మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతే కాకుండా మీరు శాఖాహారానికి అలవాటు పడాలి. ఈ విధంగా చేయడం వలన మీపై పడిన శని ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు.
మీ అర చేతుల రంగు కనుక మారిపోతే అప్పుడు మీపై శని ప్రభావం పడిందని తెలుసుకోవచ్చు. ఇది మొదటగా బ్లూ కలర్ లో ఉంది ఆ తరువాత నల్ల మచ్చలుగా మారుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో శని మీపై అధికంగా కోపాన్ని కలిగి ఉంటాడు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీ పాదరక్షలను ఎవరైనా దొంగిలిస్తే అదికూడా మీపై శని ప్రభావం ఉందనడానికి ఒక కారణం. ఇది పోవాలంటే మీరు కొత్త నల్ల రంగు చెప్పులను శనివారం రోజున ఎవ్వరికైనా దానం చేయాలి.
పై విషయాలు కనుక మీరు గమనిస్తే శని మీపై ఉందని అర్ధం. వీటికి మీరు శాంతి జరిపించుకొని పరిహారం పొందగలరు.
No comments