Latest

Loading...

SBI Mobile Number Change: ఎస్‌బీఐ అకౌంట్‌లో మొబైల్ నెంబర్ ను ఇలా మార్చండి....!

SBI Mobile Number Change

 మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI కస్టమరా? ఎస్‌బీఐ అకౌంట్ ఉందా? మీ అకౌంట్‌లో మొబైల్ నెంబర్ మార్చాలనుకుంటున్నారా? చాలా ఈజీ. ఇందుకోసం మీరు బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లోనే మొబైల్ నెంబర్ మార్చొచ్చు. మీ దగ్గర స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్, కంప్యూటర్, ల్యాప్‌టాప్ లాంటి గ్యాడ్జెట్స్ ఉంటే చాలు. సులువుగా మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేయొచ్చు. ఇంటర్నెట్ తప్పనిసరి. మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేసేప్పుడు మీ దగ్గర ఏటీఎం కమ్ డెబిట్ కార్డ్ కూడా ఉండాలి. వన్ టైమ్ పాస్‌వర్డ్ ద్వారా మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి.


SBI Mobile Number Change: మొబైల్ నెంబర్ మార్చడానికి ఈ స్టెప్స్ ఫాలో అవండి



ముందుగా ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ https://www.onlinesbi.com/ ఓపెన్ చేయాలి.

మీ వివరాలతో అకౌంట్‌లో లాగిన్ కావాలి.

ఎడమవైపు My Accounts and Profile పైన క్లిక్ చేయాలి.

డ్రాప్‌డౌన్ మెనూలో Profile పైన క్లిక్ చేయాలి.

ఆ తర్వాత పర్సనల్ డీటెయిల్స్, మొబైల్ పైన క్లిక్ చేయాలి.

ఈ స్టెప్‌లో మీ ప్రొఫైల్ పాస్‌వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

మీరు లాగిన్ సమయంలో ఉపయోగించిన పాస్‌వర్డ్ కాదు.

మీరు గతంలో క్రియేట్ చేసిన ప్రొఫైల్ పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి.

ఆ తర్వాత Change Mobile Number-Domestic only పైన క్లిక్ చేయాలి.

కొత్త స్క్రీన్ పైన పర్సనల్ డీటెయిల్స్-మొబైల్ నెంబర్ అప్‌డేట్ అని కనిపిస్తుంది.

ఆ తర్వాత మీ కొత్త మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.

కొత్త మొబైల్ నెంబర్ మరోసారి ఎంటర్ చేయాలి.

ఆ తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయాలి.

మీ మొబైల్ నెంబర్ వెరిఫై చేయాలని పాప్ అప్ మెసేజ్ కనిపిస్తుంది.

OK పైన క్లిక్ చేయాలి.

ఆ తర్వాత ఓటీపీ, ఏటీఎం, కాంటాక్ట్ సెంటర్ అనే మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి.

By OTP on both the Mobile Number అనే ఆప్షన్ క్లిక్ చేయాలి.

ఆ తర్వాత మీ అకౌంట్ సెలెక్ట్ చేయాలి.

ఏటీఎం కార్డు సెలెక్ట్ చేయాలి.

మీ ఏటీఎం కార్డు నెంబర్, వేలిడిటీ, కార్డ్ హోల్డర్ పేరు, పిన్ లాంటి వివరాలు ఎంటర్ చేయాలి.

ఆ తర్వాత ఓటీపీ, రిఫరెన్స్ నెంబర్ మీ పాత మొబైల్ నెంబర్‌కు వస్తుంది.

ఆ తర్వాత ACTIVATE అని టైప్ చేసి 8 అంకెల ఓటీపీ టైప్ చేసి 13 అంకెల రిఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేసి 567676 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి.

ఈ ఫార్మాట్‌లో మీ రెండు మొబైల్ నెంబర్ల నుంచి 4 గంటల్లో ఎస్ఎంఎస్ పంపాలి.

మీ ఓటీపీ విజయవంతంగా వెరిఫై అయిన తర్వాత మీ మొబైల్ నెంబర్ అప్‌డేట్ అవుతుంది.

No comments

Powered by Blogger.