Latest

Loading...

Senior Citizens Saving Scheme: వృద్ధులకు అత్యుత్తమ పొదుపు పథకం SCSS.. ఏడాదికి 7.4 శాతం...!!

Senior Citizens Saving Scheme

 బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయడం వల్ల క్రమంగా ఆదాయాన్ని పొందవచ్చని చాలా మంది అనుకుంటారు. ముఖ్యంగా పదవీ విరమణ తర్వాత వృద్ధులు దీన్ని నిరంతర ఆదాయ మార్గంగా భావిస్తారు. అయితే ప్రస్తుతం కరోనా సంక్షోభం ఎక్కువగా ఉన్న కారణంగా ఆర్థిక మాంద్యం ముప్పు నుంచి బయటపడటానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులన్నీ వడ్డీరేట్లపై కోత విధించాయి. ఇలాంటి తరుణంలో మెరుగైన రిటర్నులు అందించే పథకాన్ని ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఇది ఆకర్షణీయమైన పెట్టుబడి పథకంగా మారనుంది. అదే సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్(SCSS).


రిటైర్మెంట్ తర్వాత పెద్ద మొత్తంలో సొమ్ము డిపాజిట్ చేసే భారత వృద్ధులు ఈ పథకం ద్వారా మెరుగైన రాబడులు అందుకోవచ్చు.


వ్యక్తిగతంగా లేదా ఉమ్మడిగా ఇందులో పెట్టుబడి పెట్టి రెగ్యులర్ గా ఆదాయాన్ని పొందవచ్చు. ఇందులో పెట్టుబడి పెట్టడం వల్ల ఏడాదికి 7.4 శాతం రాబడి అందుకోవచ్చు.


అర్హత..

ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ పథకంలో 60 ఏళ్లకు పైబడిన ప్రతి ఒక్కరూ అర్హత సాధిస్తారు. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న 55 నుంచి 60 ఏళ్లలోపు వ్యక్తులకు కూడా ఈ పథకంలో చేరే సౌలభ్యాన్ని కల్పించింది ప్రభుత్వం. అదే రిటరైన మిలిటరీ ఉద్యోగులకు అయితే 50 ఏళ్ల నుంచి ఈ అవకాశం కల్పించింది.


మినిమమ్ బ్యాలెన్స్..

ఈ పథకంలో కనీస డిపాజిట్ రూ.1000తో ప్రారంభమవుతుంది. గరిష్ఠంగా రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఖాతాలో డిపాజిట్ అయిన మొత్తం రూ.1000ల గుణిజాల్లో ఉండాలి. బ్యాంకులు సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ కోసం వ్యక్తిగత ఖాతాలతో పాటు జీవిత భాగస్వామితో కలిసి ఉండే ఉమ్మడి ఖాతాలను తీసుకోవడానికి కూడా అనుమతిస్తాయి.


వడ్డీరేటు..

ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన మొత్తంపై అత్యధికంగా ఏడాదికి 7.4 శాతం వడ్డీ వస్తుంది. త్రైమాసికంగా ఆర్థిక మంత్రిత్వశాఖ ఈ వడ్డీరేటును సమీక్షిస్తుంది. ప్రతి ఏడాది ఏప్రిల్, జులై, అక్టోబరు, జనవరి నెల మొదటి తేదీన వడ్డీ చెల్లిస్తారు.


కాలపరిమితి..

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌ టెన్యూల్ లేదా మెచూరిటీ ఐదు సంవత్సరాలు. ఈ కాలపరిమితి పూర్తయితే మరో మూడేళ్ల పాటు పొడిగించుకునే వీలుంటుంది. రెండేళ్లలోపు అకౌంట్ మూసివేయాలి అనుకుంటే 1.5 శాతం జరిమానా, రెండేళ్ల తర్వాత అయితే ఒక శాతం జరిమానా విధిస్తారు. అంటే ఏడాది నుంచి రెండేళ్ల వరకు 1.5 శాతం వరకు, రెండేళ్ల తర్వాత 1 శాతం రుసుము చెల్లించాలి.

No comments

Powered by Blogger.