Latest

Loading...

Skin black fungus:. 'స్కిన్​ బ్లాక్​ ఫంగస్'తో మరో టెన్షన్ దేశంలో ఫస్ట్ కేసు నమోదు..

Skin black fungus


దేశంలో కరోనా విజేతలను ఫంగస్ టెన్షన్ వెంటాడుతుంది. తొలుత బ్లాక్, ఆ తర్వాత వైట్, తాజాగా ఎల్లో ఫంగస్ కేసులు దేశంలో నమోదైన విషయం తెలిసిందే. ముఖ్యంగా బ్లాక్ ఫంగస్ కేసులు దేశంలో భారీగా నమోదవుతున్నాయి. ఇవన్నీ చాలనట్టు కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో దేశంలో మొదటి స్కిన్‌ బ్లాక్‌ ఫంగస్‌ కేసు నమోదవ్వడం అలజడి రేపింది. చిత్రదుర్గ జిల్లాలో 50 ఏళ్ల రోగిలో స్కిన్ బ్లాక్‌ ఫంగస్‌ కనిపించిందని దేశంలో ఇదే ఫస్ట కేసు అని వైద్యుల బృందం తెలిపింది. నెల క్రితం కరోనా వైరస్‌ నుంచి కోలుకున్న బాధితుడి చర్మంపై బ్లాక్‌ ఫంగస్‌ కనిపించిందని వైద్యులు తెలిపారు. బాధితుడికి మధుమేహం కూడా ఉందని పేర్కొన్నారు. బాధితుడి కుడి చెవి దగ్గర ఉన్న చర్మంలో బ్లాక్‌ ఫంగస్‌ కనిపించిందని డాక్టర్లు తెలిపారు

ఇప్పటికే ఆ బాధితుడికి మొదటి దశ ఆపరేషన్ ద్వారా చర్మంపై ఉన్న బ్లాక్‌ ఫంగస్‌ను తొలగించగా ఇప్పుడు రెండో దశ చికిత్సకు సిద్ధమవుతున్నారు. బ్లాక్​ ఫంగస్​పై రోజుకో వార్త దేశ ప్రజలను భయపెడుతోంది.


కాగా.. ఈ బ్లాక్​ ఫంగస్​ మెదడుపైనా ప్రభావం చూపిస్తోందని తేలింది. మధ్యప్రదేశ్​ ఇందోర్​లోని మహారాజా యశ్వంత్​రావ్​ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన రోగుల్లో 15శాతం మంది మెదళ్లలో ఈ బ్లాంక్​ ఫంగస్​ను గుర్తించారు. తలనొప్పి, వాంతులు బ్లాక్ ఫంగస్ యొక్క ప్రాథమిక లక్షణాలు కాగా.. మెదడులో వ్యాధి ముదిరితే రోగి సృహ కోల్పోయే ప్రమాదం కూడా ఉంది.సైనస్​ ద్వారా ఈ బ్లాక్​ ఫంగస్​ మొదడుకు చేరే అవకాశముందని వైద్యులు అభిప్రాయపడ్డారు

No comments

Powered by Blogger.