Latest

Loading...

Sleep while reading చదివేటప్పుడు నిద్ర ఎందుకు వస్తుంది..?

 

Sleep while reading

ఫోనులో చూస్తున్నప్పుడు, ఎవరితో అయినా ముచ్చట్లు పెట్టినప్పుడు, టీ.వీ చూస్తున్నప్పుడు ఎంత రాత్రి వరకు మెలుకువగా కూర్చున్న నిద్ర అనే మాట గుర్తుకు రాదూ. పైగా చాల చురుగ్గా ఉంటాము. అయితే చదవడానికి పుస్తకాలు ముందేసుకుంటే మాత్రం నిద్రాదేవి వెంటనే మనల్ని ఆవహించేస్తుంది. కారణం చదివేటప్పుడు నిద్ర రావడమనేది మనం ఏ భంగిమలో ఉన్నాం, ఎంతసేపు ఉన్నాం అనేవాటి మీద ఆధారపడి ఉంటుంది. చదివేటప్పుడు కదలికలు తక్కువగా ఉండడం వల్ల కండరాలకు ప్రవహించే రక్తప్రసరణం తగ్గుతుంది. దానివల్ల శరీరంలో జీవకణాల్లో దహనచర్య మందగించి 'లాక్టిక్ యాసిడ్' అనే ఆమ్లం తయారవుతుంది. ఈ ఆమ్లం ప్రాణవాయువైన ఆక్సిజన్ ను అతిగా గ్రహించి, దేహంలోని రక్తానికి కావలసిన ఆక్సిజన్ ను అందించదు.ఆక్సిజన్ తగినంతగా లేని రక్తం మెదడులోకి ప్రవహించడం వల్ల మగతగా నిద్ర వస్తున్నట్టుగా ఉంటుంది.

అందుకే చదివేటప్పుడు ఒకే భంగిమలో ఉండిపోకుండా అప్పుడప్పుడు అటూ ఇటూ కదులుతూ ఉండాలి.

No comments

Powered by Blogger.