Latest

Loading...

Teacher Jobs 2021: మొత్తం 5,807 టీజీటీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ప్రారంభం...!

Teacher Jobs 2021


ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్-DSSSB భారీగా టీచర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 5,807 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్-TGT పోస్టుల్ని ప్రకటించింది. ఇంగ్లీష్, పంజాబీ, బెంగాలీ, ఉర్దూ, సంస్కృతం లాంటి విభాగాల్లో ఈ పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 జూలై 3 చివరి తేదీ. ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరిన్ని వివరాలను DSSSB అధికారిక వెబ్‌సైట్ https://dsssb.delhi.gov.in/ లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు https://dsssbonline.nic.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అప్లై చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి.

DSSSB TGT Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...

మొత్తం ఖాళీలు- 5,807

టీజీటీ సంస్కృతం ఫీమేల్- 1,159

టీజీటీ సంస్కృతం మేల్- 866

టీజీటీ ఇంగ్లీష్ మేల్- 1,029

టీజీటీ ఇంగ్లీష్ ఫీమేల్- 961

టీజీటీ ఉర్దూ ఫీమేల్- 571

టీజీటీ ఉర్దూ మేల్- 346

టీజీటీ పంజాబీ ఫీమేల్- 492

టీజీటీ పంజాబీ మేల్- 382

టీజీటీ బెంగాలీ ఫీమేల్- 1

DSSSB TGT Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు

దరఖాస్తు ప్రారంభం- 2021 జూన్ 4

దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జూలై 3

విద్యార్హతలు- బ్యాచిలర్స్ డిగ్రీ కనీసం 45 శాతం మార్కులతో పాస్ కావాలి.

వయస్సు- 32 ఏళ్లు

దరఖాస్తు ఫీజు- రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు

ఎంపిక విధానం- టియర్ 1, టియర్ 2 ఎగ్జామ్, స్కిల్ టెస్ట్.


DSSSB TGT Recruitment 2021: దరఖాస్తు విధానం


అభ్యర్థులు https://dsssb.delhi.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

హోమ్ పేజీలో LINK FOR ONLINE APPLICATION REGISTRATION SYSTEM (OARS) లింక్ పైన క్లిక్ చేయాలి.

కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.

అందులో Click for New Registration పైన క్లిక్ చేయాలి.

అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతలు, ఇతర వివరాలతో దరఖాస్తు ఫామ్ పూర్తి చేయాలి.

దరఖాస్తు ఫీజు చెల్లించి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి.

దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.

No comments

Powered by Blogger.