Latest

Loading...

Teachers EligibilityTest: టెట్​ అభ్యర్థులకు కేంద్రం తీపికబురు.

Teachers EligibilityTest

 టీచర్​ ఎలిజిబిలిటీ టెస్ట్​ (టెట్​) అభ్యర్థులకు కేంద్ర విద్యాశాఖ తీపికబురు అందించింది. టెట్​ క్వాలిఫైయింగ్​ సర్టిఫికెట్​ గడువును 7 సంవత్సరాల నుంచి జీవిత కాలం పొడిగిస్తూ కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్​ పోఖ్రియల్​ నిశాంక్​ కీలక ఆదేశాలను జారీచేశారు.


నేషనల్​ కౌన్సిల్​ ఫర్​ టీచర్​ ఎడ్యుకేషన్​ (ఎన్​సీటీఈ) ప్రకారం 2011, ఫిబ్రవరి నుంచి ఈ పెంపును అమలు పరచాలన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉపాధ్యాయ రంగంలో స్థిరపడాలనే వారికోసం ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.

అభ్యర్థులందరికి ఉపాధి అవకాశాలు పెంచాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.


ఇప్పటికే 7 సంవత్సరాల గడువు ముగిసిన అభ్యర్థులకు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలు నూతన మార్గదర్శకాలకు అనుగుణంగా కొత్త సర్టిఫికెట్​ల జారీలో తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అయితే, గతంలో టెట్​కు 7 సంవత్సరాల అర్హత ఉండేది. అదే విధంగా, ఒక అభ్యర్థి టెట్​ను ఎన్నిసార్లయినా రాసుకోవచ్చన్న విషయం తెలిసిందే.

No comments

Powered by Blogger.