Teachers financial benefits ఉపాధ్యాయ కుటుంబాలకు ఆర్థిక ప్రయోజనం చెల్లించాలి....?
ఎస్టీయూ నాయకులతో ఎమ్మెల్సీ నరసింహారెడ్డి
కరోనాతో మృతి చెందిన ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబాలకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను వెంటనే చెల్లించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కదిరి పట్టణంలో కరోనా మృతిచెందిన ఉపాధ్యాయ కుటుంబాల పరిస్థితి ఆరా తీశారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని ప్రయోజనాలు అందేలా కృషి చేస్తానన్నారు. ఎవరూ అధైర్యపడొద్దని భరోసా కల్పించారు. మృతిచెందిన ఉపాధ్యాయ కుటుంబాలకు అందాల్సిన ప్రయోజనాలను ప్రత్యేక ఉత్తర్వుతో సత్వరం అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు
.ఆ కుటుంబాలకు కారుణ్య నియామకంద్వారా ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలు ఆర్థిక ప్రయోజనాలు పొందేలా దరఖాస్తు చేసుకునేందుకు తగిన పత్రాలను అందజేశారు.
No comments