Latest

Loading...

Telangana: ముంచుకొస్తున్న థర్డ్ వేవ్‌.. తెలంగాణలో 30 లక్షల మంది పిల్లలకు వైరస్..!

Telangana

మన దేశంలో కరోన సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. కొత్త కేసులతో పాటు మరణాలు కూడా తగ్గుతున్నాయి. ఐతే అంతలోనే థర్డ్ వేవ్ గురించి అంతటా ఆందోళన నెలకొంది. త్వరలోనే థర్డ్ వేవ్ వైరస్ వ్యాప్తి చెందుతుందని... పిల్లలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆగస్టు, సెప్టెంబర్‌లో మన దేశంలోని చిన్నారులపై వైరస్ విరుచుకుపడే అవకాశముందని భావిస్తున్నారు. ఒక్క తెలంగాణలోనే దాదాపు 30 లక్షల మంది పిల్లలు వైరస్ సోకవచ్చని అంచనా వేస్తున్నట్లు  పేర్కొంది. వీరిలో 8వేల మంది ఐసీయూలో చేరవచ్చని చెబుతున్నారు. అంతేకాదు 1 శాతం మంది పిల్లలకు మల్టీ సిస్టమ్ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్ (MIS-C) ముప్పుపొంచి ఉందన్న వార్తలు తల్లిదండ్రులను టెన్షన్ పెడుతున్నాయి

కరోనా ఫస్ట వేవ్ చిన్నారులపై అంతగా ప్రభావం చూపలేదు. సెకండ్ వేవ్‌లో కేసులు పెరిగాయి. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో 81,967 మంది పిల్లలు కరోనా బారినపడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఐతే మూడో దశలో మాత్రం పిల్లలపై కరోనా తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని కొన్ని రోజులుగా నిపుణులు చెబుతున్నారు. కనీసం 2-3 నెలల వరకు థర్డ్ వేవ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. దాదాపు 30 లక్షల మంది చిన్నారులకు కరోనా సోకే ప్రమాదముందని... వీరిలో 24 లక్షల మందికి ఎలాంటి లక్షణాలు ఉండకపోవచ్చని భావిస్తున్నారు. 8వేల మందికి ఐసీయూలో చికిత్స అవసరం ఉండవచ్చని యోచిస్తున్నారు. అందుకే పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


నిపుణుల హెచ్చరికల ఆధారంగా.. థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆస్పత్రుల్లో ఆ దిశగా మౌలిక సదుపాయాలను పెంచుతోంది. పిల్లల కోసం ప్రత్యేక వార్డులతో పాటు అదనపు పడకలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం నిలోఫర్, గాంధీ ఆస్పత్రుల్లోనే పిల్లలకు వైద్య సేవలు అందించే సదుపాయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇతర జిల్లా ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల్లోనూ చిన్నారులకు అవసరమైన బెడ్స్ సంఖ్యను పెంచనున్నారు. కొత్తగా 5వేల పడకలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇందులో 2వేల ఐసీయూ బెడ్లు, మిగిలిన వాటిలో ఆక్సిజన్ సేవలు అందుతాయి. థర్డ్ వేవ్‌కు ముందే అవసరమైన చోట సిబ్బందిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.


అటు మందులపైనా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. థర్డ్ వేవ్‌లో ఔషధాల కొరత ఉండకుండా ఇప్పటి నుంచే చర్యలు చేపట్టింది. విషమ పరిస్థితుల్లో ఐసీయూలో చికిత్స పొందే పిల్లలకు ఇమ్యునో గ్లోబ్యులిన్ వంటి మందులను ఇస్తారు. ఒక డోసు ధర రూ. 10 వేల వరకు ఉంటుంది. పిల్లల బరువు, వయసును బట్టి ఒక్కొక్కరికి 3 నుంచి 4 డోసులు ఇవ్వాల్సి వస్తుంది. రాబోయే రోజుల్లో వీటికి డిమాండ్ పెరిగే అవకాశం ఉండడంతో... అందుకు అనుగుణంగా మందులను సమకూర్చుతున్నారు. ఇక 12 ఏళ్లు పైడిన చిన్నారులకు రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు ఇస్తారు. ఈ క్రమంలో రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్‌లను కూడా దాదాపు 2వేల వరకు సమకూర్చాలని ఇటీవల నిపుణుల కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. వీటితో పాటు 10 వేల విటమిన్‌-సి టాబ్లెట్లు, 2 వేల విటమిన్‌-డి చుక్కల మందును, పారాసెటమాల్‌ వంటి 12 రకాల ఔషధాలను, 20 రకాల వైద్య పరికరాలు, వస్తువులను కొనుగోలు చేయనున్నారు.

No comments

Powered by Blogger.