Latest

Loading...

Telangana Inter Results 2021: తెలంగాణ ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల....!!

Telangana Inter Results

 తెలంగాణ ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాలను సోమవారం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. పరీక్ష ఫీజు చెల్లించిన 4,51,585 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి తెలిపారు. ఉత్తీర్ణత సాధించిన వారిలో 2,28,754 మంది బాలికలు ఉండగా.. 2,22,831 మంది బాలురు ఉన్నారు. 1,76,719 మంది ఏ గ్రేడ్‌, 1,04,886 మంది బి గ్రేడ్, 61887 సి గ్రేడ్, 1,08,093 మంది విద్యార్థులు డీ గ్రేడ్ సాధించినట్లు తెలిపారు. ఫీజు చెల్లించిన ప్రతి విద్యార్థి పాస్ అయినట్లు ప్రకటించారు. గత ఏడాది ఇంటర్ మొదటి సంవత్సరంలో సాధించిన మార్కులు ఆధారంగా ఫలితాలు కేటాయింపు జరిగింది. ప్రాక్టికల్స్ పరీక్షలకుగాను 100% మార్కులను వేశారు.


గతంలో ఇంటర్ మొదటి సంవత్సరంలో ఉత్తీర్ణులు కాలేకపోయిన వారు, ప్రైవేట్ గా పరీక్షలు రాసేందుకు ఫీజులు చెల్లించిన వారికి 35% పాస్ మార్కుల కేటాయించారు. ఫలితాలను tsbie.cgg.gov.in, examresults.ts.nic.in వెబ్‌సైట్లలో తెలుసుకోవచ్చు. results.cgg.gov.in వెబ్‌సైట్‌లో కూడా ఫలితాలు లభిస్తాయి.


వెబ్‌సైట్‌లో ప్రథమ సంవత్సరపు హాల్ టికెట్ నెంబర్ పొందుపరచడం ద్వారా ద్వితీయ సంవత్సరపు విద్యార్థులు మార్క్ పొందవచ్చు. గతంలో ఫెయిల్ అయిన విద్యార్థులు తమ పూర్వపు హాల్ టికెట్ పొందుపరచడం ద్వారా మార్కులను తెలుపుకోవచ్చు. విద్యార్థులు ఈ ఫలితాలతో సంతృప్తి చెందక పోతే, కరోనా పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత ప్రత్యేకంగా పరీక్షలను నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. ఇంటర్‌ మెమోలో తప్పులుంటే ఫిర్యాదు చేసేందుకు అవకాశం

కల్పించారు. విద్యార్థులు 040 24600110 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని కోరారు. ఈ నంబర్ ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.


కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో ఇంటర్‌ పరీక్షలను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఫలితాల వెల్లడికి సంబంధించి తెలంగాణ ఇటీవల మార్గదర్శకాలు ఖరారు చేసింది. తాజాగా ఆ మేరకు ఫలితాలు విడుదల చేసింది.


కరోనా కారణంగా..ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను ముందుగా రద్దు చేశారు. అనంతరం సెకండియర్ పరీక్షలను నిర్వహిస్తారని వార్తలు వచ్చినా.. విద్యార్థులు ఆరోగ్యాన్ని మైండ్‌లో పెట్టుకుని విద్యాశాఖ ఆ దిశగా అడుగులు వేయలేదు. కరోనా వైరస్ తగ్గుముఖం పడుతున్నా..డెల్టా వేరియంట్ విస్తరిస్తుందని, కరోనా థర్డ్ వేవ్ వ్యాపిస్తుందనే నిపుణులు హెచ్చరికల నేపథ్యంలో పరీక్షలను రద్దు చేసి ఫలితాలను విడుదల చేశారు. ఫస్ట్, సెకండియర్ విద్యార్థులు పాస్ అయినట్లు విద్యాశాఖాధికారులు వెల్లడించారు.

No comments

Powered by Blogger.