Telangana lockdown తెలంగాణలో నేటి నుంచి పగటిపూట లాక్డౌన్ ఎత్తివేత....!!
రాష్ట్రంలో నేటి నుంచి పగటిపూట లాక్డౌన్ను ఎత్తివేయనున్నారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 5 వరకు లాక్డౌన్ సడలింపునకు అవకాశం ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇళ్లకు వెళ్లేందుకు మరో గంట వెసులుబాటును కల్పించింది. సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల మధ్య కఠిన ఆంక్షలు అమలులోకి రానున్నాయి. నేటి నుంచి ఈ నెల 19 వరకు లాక్డౌన్ కొత్త నిబంధనలు అమలులో ఉండనున్నాయి. కాగా...కరోనా తగ్గని 7 నియోజకవర్గాల్లో పాత నిబంధనలు కొనసాగనున్నాయి.
No comments