Telangana schools తెలంగాణలో స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు....!!
తెలంగాణలో ఈ నెల 20 వరకు స్కూళ్లకు వేసవి సెలవులను ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ప్రస్తుతం తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రభుత్వం.. కరోనా రెండో వేవ్ నియంత్రణ కోసం రాష్ట్రంలో విధించిన లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ, పలు సడలింపులు ఇచ్చింది. ఈ నెల 19 వరకు లాక్డౌన్ అమలులో ఉంది. సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుత కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ మీడియట్ రెండవ సంవత్సరం పరీక్షలను కూడా రద్దు చేసింది.
మొదటి సంవత్సరం విద్యార్థులను సెకండ్ ఇయర్‌కు ప్రమోట్ చేసింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
No comments