Latest

Loading...

Textbooks పాఠ్యపుస్తకాలు వచ్చేశాయ్...!

Textbooks


కడప విద్య ప్రభుత్వ విద్యాలయాల పునఃప్రారంభం రోజునే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, విద్యాసామగ్రి అందించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే జగనన్న విద్యాకానుకకు సంబంధించి రాత పుస్తకాలు వంటివి జిల్లాకు చేరుతుండగా ప్రస్తుతం మొదటి విడతగా తరగతుల వారీగా పాఠ్యపుస్తకాలూ జిల్లా కేంద్రానికి చేరాయి. మండలాల వారీగా కేటాయింపుల ప్రకారం చేరుతున్నాయి. 2021 - 22 విద్యాసంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుందన్న విషయంలో స్పష్టత లేకపోయినా 1 నుంచి 10వ తరగతి వరకూ అన్ని మాధ్యమాలకు అవసరమైన పాఠ్యపుస్తకాల తరలింపు క్రతువు మొదలైంది.

జిల్లా కేంద్రంలోని గోదాంకు రాష్ట్రస్థాయి నుంచి పుస్తకాలు చేరుతున్నాయి. అక్కడ నుంచి ఆర్టీసీ బస్సుల ద్వారా నేరుగా మండల వనరుల కేంద్రాలకు సరఫరా చేస్తున్నారు. ఇప్పటికే మండలాలకు చేరవేసే చర్యలు చేపట్టారు. రెండేళ్లుగా యూడైస్‌లోని విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠ్యపుస్తకాలను పంపిణీ చేస్తున్నారు. కొన్నేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుండటంతో 10 శాతంపైబడి ఎక్కువగా లెక్కగట్టి ప్రభుత్వానికి జిల్లా విద్యాశాఖ యంత్రాంగం నివేదించింది. ఆ తరువాత ప్రవేశాల ప్రక్రియ పూర్తయిన తరువాత లోటుపాట్లను సరిచేసుకోనున్నారు. ఈ ఏడాది ఏడోతరగతి సిలబస్‌లో మార్పులు ఉండడంతో పుస్తకాలు చేరేందుకు కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మొత్తంగా పాఠశాలల పునఃప్రారంభం నాటికి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది.


మండల కేంద్రాలకు పాఠ్యపుస్తకాలు...

పాఠశాలల పునఃప్రారంభం రోజునే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. జిల్లా గోదాంకు చేరుతున్న వాటిని మండల వనరుల కేంద్రాలకు చేర్చేలా చర్యలు చేపడుతున్నాం. ఆయా మండలాల్లోని మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు పుస్తకాలు భద్రపరిచేందుకు సిద్ధంగా ఉండాలి. పాఠ్యపుస్తకాల జాబితా వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది.

No comments

Powered by Blogger.