TS News: రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేసే తీరుతాం...?
రైతులు పెట్టుబడి భారాన్ని తగ్గించుకుంటూ లాభసాటి పంటల సాగు వైపు దృష్టి సారించాలన్నారు. వెదజల్లే పద్ధతితో ఎకరాకు రూ.6 వేల పెట్టుబడి తగ్గి, 3-4 క్వింటాళ్ల అధిక దిగుబడి వస్తుందన్నారు. ఆయిల్‌పామ్ సాగు లాభసాటిగా ఉంటుందన్నారు. సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు సొమ్ము చెల్లించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఛాట్లపల్లి సభలో మంత్రి మాట్లాడుతుండగా గ్రామంలో అనర్హులకు రెండు పడక గదుల ఇళ్లు మంజూరు చేశారని పలువురు నినాదాలు చేయడంతో గందరగోళం నెలకొంది. మంత్రి స్పందిస్తూ.. అవసరమైతే ఛాట్లపల్లిని దత్తత తీసుకొని అర్హులందరికీ న్యాయం చేస్తానని చెప్పడంతో వారు శాంతించారు.
కొత్తగా మహిళా, శిశు సంక్షేమ ఆసుపత్రులు
నవజాత శిశువులు, మహిళల వైద్యానికి కొత్తగా మహిళా శిశు సంక్షేమ ఆసుపత్రులను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా, రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. హైదరాబాద్ బుద్ధభవన్‌లో ఆదివారం తెలంగాణ మహిళా కమిషన్ కార్యాలయాన్ని ఛైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, మహిళా-శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌లతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, శిశు సంక్షేమశాఖ కమిషనర్ దివ్య, మహిళా కమిషన్ సభ్యులు పాల్గొన్నారు. జిల్లాల్లో ఉన్నత పాఠశాలలు, ఇంటర్ కళాశాలల విద్యార్థినులకు మహిళా సంరక్షణ చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు. చట్టాలను పకడ్బందీగా అమలు చేస్తామని వివరించారు.
No comments