Latest

Loading...

Whole Grains: తృణధాన్యాలతో బరువు పెరుగుతారా.. పొట్టు తీయని ధాన్యాలు తింటే ప్రయోజనం ఉంటుందా...?

Whole Grains


Whole grains: ఈ రోజుల్లో అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నావారి సంఖ్య భారీగా పెరిగిపోయింది. పని ఒత్తిడి కారణంగానో, లేదా మరే ఇతర కారణాల వల్ల ఊబకాయుల సంఖ్య పెరిగిపోయింది. వెయిట్ తగ్గడానికి ఎన్నో కసరత్తులు చేస్తున్నారు. దాని కోసం వాకింగ్ , జాగింగ్ లాంటి వ్యాయమాలు చేస్తున్నారు. అంతే కాదు నిత్యం తినే ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ఊబకాయుల సంఖ్య పెరుగుతోంది. వేళకు మంచి ఆహారం తీసుకోకపోవడం, శరీరానికి సరైన వ్యాయామం అందకపోవడం.. ఎక్కువ సేపు కూర్చుని పని చేయడం.. ఇలా పలు కారణాలతో.. పొట్ట, నడుము, చేతులు, తొడలు.. ఇలా చాలా భాగాల్లో కొవ్వు పేరుకుపోయి..

చూడటానికి షేప్‌లెస్‌గా మారిపోతుంటారు. అయితే ముడిబియ్యంగా తినడం వల్ల, పొట్టుతీసిన వాటితో పోలిస్తే తక్కువ బరువు పెరుగుతారట. దాంతో స్థూలకాయంతో వచ్చే అనర్థాలనూ తగ్గించుకోవచ్చు అంటున్నారు పరిశోధకులు.


పొట్టు తీయని ధాన్యాలను (హోల్‌ గ్రేయిన్స్‌ను) ఆహారంగా తీసుకుంటే అందులోని పీచు పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్య కారకాలన్న సంగతి తెలిసిందే. ఉదాహరణకు వరిని ముడిబియ్యంగా తినడం వల్ల, పొట్టుతీసిన వాటితో పోలిస్తే తక్కువ బరువు పెరుగుతారట. దాంతో స్థూలకాయంతో వచ్చే అనర్థాలనూ తగ్గించుకోవచ్చు అంటున్నారు పరిశోధకులు. నిరూపితమైన ఈ అధ్యయన ఫలితాలను అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ క్లినికల్‌ న్యూట్రిషన్‌లో ప్రచురించారు.


పొట్టు ఉన్న కారణంగా హోల్‌ గ్రెయిన్స్‌ జీర్ణమయ్యే వేగం చాలా నెమ్మదిగా కొనసాగుతుంటుందట. అందువల్లనే ఒంట్లోకి చక్కెర విడుదలు సైతం ఆలస్యమవుతుంటాయి. ఇక ఇదే అంశం ఆరోగ్యానికి మరో అనుకూలమైన అంశంగా నిరూపితమైందని చెబుతున్నారు పరిశోధకులు. ఫలితంగా ఇన్సులిన్‌ విడుదల యంత్రాంగం మంచి నియంత్రితంగా ఉంటుందంటున్నారు పరిశోధకులు. ఇక వరి, ఓట్స్, గోధుమ, బార్లీ వంటి వాటిని పొట్టుతో తినడం వల్ల బరువు పెరగకుండా ఉండే మరో ప్రయోజనమూ ఉంటుందట. ధాన్యాలు ముఖ్యంగా B విటమిన్లలో ఎక్కువగా ఉంటాయి నియాసిన్, థియామిన్ అధికంగా ఉంటాయి. జింక్, మెగ్నీషియం జింక్ వంటివి అధికంగా ఉంటాయి. అంతే కాకుండా ఈ తృణధాన్యల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది.

No comments

Powered by Blogger.