'Aadhaar ఆధార్' మొబైల్ నంబర్.. అప్‌డేట్ చేసుకోండిలా...!
అవును! మీ ఆధార్‌కార్డుకు సంబంధించిన మొబైల్ నంబర్‌ను స్వయంగా మీరే అప్‌డేట్ చేసుకోవచ్చు. శాశ్వత ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లి, అక్కడ గంటల తరబడి నిలబడే పనిలేకుండా... యూఐడీఏఐ (యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారటీ ఆఫ్ ఇండియా) ఈ అవకాశాన్ని కల్పిస్తోంది. అయితే ఇందుకు మీ మొబైల్ నంబర్‌ని ఆధార్‌కార్డుతో లింక్ చేసుకోవాల్సి ఉంటుంది.
అప్‌డేట్ చేయండిలా!
1. ఆధార్ అనుసంధాన మొబైల్ నంబర్ అప్‌డేట్ కోసం యూఐడీఏఐ వెబ్ పోర్టల్ ask.uidai.gov.in ఓపెన్ చేయండి.
2. ఈ పోర్టల్‌లో మీరు అప్‌డేట్ చేయాలనుకుంటున్న కొత్త మొబైల్ నంబర్, క్యాప్‌చాను ముందుగా నమోదు చేసి
మీ మొబైల్ నంబర్‌కి వచ్చిన ఓటీపీతో లాగిన్ అవ్వాలి.
3. అనంతరం ఓపెన్ అయిన డ్రాప్‌డౌన్ బాక్స్‌లో 'అప్‌డేట్ ఆధార్'పై క్లిక్ చేసి ముందుకెళ్లండి.
4. ఆపై ఆధార్ నంబర్, పూర్తి పేరు నమోదు చేసి మీరు అప్‌డేట్ చేయాలనుకుంటున్న 'మొబైల్ నంబర్' కింద ఎంచుకొని ప్రోసిడ్ అవ్వండి.
5. ఆ తర్వాత మొబైల్ నంబర్, క్యాప్‌చా మళ్లీ నమోదు చేసి కొత్తగా వచ్చిన ఓటీపీని సరిచూసుకోని సేవ్&ప్రోసిండ్ క్లిక్ చేయండి.
6. దీని తర్వాత రూ.25 ఫీజు చెల్లింపు కోసం సమీప ఆధార్ సెంటర్ అపాయింట్మెంట్‌ను ఇక్కడే ఆన్‌లైన్‌లోనే తీసుకోవాలి. అనంతరం ఆధార్ సెంటర్‌కి వెళ్లాక ఫీజు చెల్లింపుతో పాటు వారు అడిగిన సమాచారం అందించాల్సి ఉంటుంది.
No comments