Latest

Loading...

Almonds Benefits: రోజూ ఎన్ని బాదంపప్పులు తినాలి...? అతిగా తింటే ఏమవుతుంది...? ఈ విషయాలు తెలుసుకోండి.

Almonds Benefits

 ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనం ఆరోగ్యంగా ఉండాలంటే.. ఎలప్పుడూ పౌష్టికాహారాన్ని తీసుకోవాలని డాక్టర్స్ సూచిస్తుంటారు. ఈ క్రమంలోనే చాలామంది నట్స్, సీడ్స్ తింటుంటారు. నట్స్‌లో ఎక్కువమంది బాదంపప్పులను ఇష్టంగా తింటారు. బాదాంపప్పుల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. అలాగే మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఈ బాదంపప్పులను ఉదయాన్నే నానబెట్టి తింటే.. జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇవి రోగనిరోధక శక్తి పెరగడంలో కూడా బాగా తోడ్పడతాయి. మరి రోజుకు ఎన్ని బాదాంలను తినాలి.? ఎలా తినాలి.? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.


బాదాంలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. వాటిని రోజూ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు అంటున్నారు.

రక్తంలో కొవ్వు స్థాయిలను తగ్గించడమే కాకుండా హైబీపీ, గుండె సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. అలాగే శరీరంలో కాల్షియం స్థాయిని కూడా పెంపొందిస్తుంది. అటు డయాబెటిస్ బాధితులు బాదంపప్పులు రోజూ తినడం చాలా మంచిది.


ఇదిలా ఉంటే శరీరానికి మేలు చేస్తుంది కదా అని చెప్పి.. మోతాదుకి మించి ఏదీ తీసుకోకూడదు. ప్రతీరోజూ ఏ ఆహారమైనా అధిక మోతాదులో తీసుకుంటే లేనిపోని ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇదే సూత్రం బాదాంలకు కూడా వర్తిస్తుంది. రోజుకు 8 నుంచి 10 బాదం పప్పులను తినమని డాక్టర్లు సూచిస్తున్నారు. అయితే బాదాంలను నేరుగా తినకుండా నీటిలో నానబెట్టి ఏడు లేదా ఎనిమిది నిమిషాల తర్వాత తొక్క తీసి తింటే మంచిదట.


అతిగా బాదాం తినడం వల్ల ఏం జరుగుతుంది.


బాదాంలో ఎన్నో పోషకాలు ఉంటాయని.. ఆరోగ్యానికి చాలా మంచిదని మోతాదుకు మించి తింటే సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయని వైద్యులు అంటున్నారు. శరీరంలో కొవ్వు పెరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జీర్ణక్రియ సమస్య వంటివి తలెత్తవచ్చునని డాక్టర్లు అంటున్నారు.


No comments

Powered by Blogger.