Andhra Pradesh ఏపిలో కొత్తగా స్టీల్ ప్యాక్టరీ
ఎపిలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు రంగం సిద్దం అవుతోంది. జిందాల్ స్టీల్ ఆంధ్ర లిమిటెడ్ కంపెనీకి ప్రభుత్వం భూములు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటిగ్రేటెడ్ స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం 860 ఎకరాల భూములు కేటాయించింది. నెల్లూరు జిల్లా చిలుకూరు మండలం మొమిడిలో ఈ భూములు ఇస్తున్నారు. మొత్తం 7,500 కోట్ల రూపాయల పెట్టుబడితో స్టీల్‌ప్లాంట్ నిర్మాణం జరగనుంది. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు వల్ల ప్రత్యక్షంగా 2,500 మంది, పరోక్షంగా 15వేల మందికి ఉపాధి కలుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీఐఐసీకి భూముల కేటాయింపునకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
No comments