Latest

Loading...

Anjeer Health Benefits అంజీరతో ఆరోగ్యం.....!!!

Anjeer Health Benefits

 ఫైబర్‌ ఎక్కువగా ఉండే అంజీరా పండ్లు మనకు ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి. ధర ఎక్కువే అయినప్పటికీ వాటితో చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

*1. బరువు తగ్గాలనుకునేవారు అంజీర తింటే చక్కగా తగ్గుతారు. అలాగని మరీ ఎక్కువ తింటే బరువు పెరుగుతారు. అందువల్ల రోజుకు నాలుగైదుకు మించకుండా తింటే మంచిది.

*2. శరీరంలో పొటాషియం తక్కువగా, సోడియం ఎక్కువగా ఉంటే బిపి పెరుగుతుంది. అంజీరలో పొటాషియం ఎక్కువ, సోడియం తక్కువ కాబట్టి బిపిని తగ్గిస్తాయి.

*3. అంజీరలో పీచు పదార్థం ఎక్కువ. దీనిలోని పొటాషియం మన శరీరంలోని షుగర్‌ లెవెల్స్‌ని కంట్రోల్‌ చేస్తుంది.

*4. పైల్స్‌ సమస్య వేధిస్తుంటే రాత్రంతా నీటిలో నానబెట్టిన డ్రై అంజీరలను నీటితో సహా తినేయాలి.

*5. అంజీర కాల్షియం ఎక్కువ. ఎముగలు బలంగా, ధఅడంగా ఉండాలంటే కాల్షియం అవసరం కాబట్టి ఫిగ్స్‌ తినాలి. తద్వారా ఎముకల్ని బలహీనపరిచే అస్థియోపోరోసిస్‌ అనే వ్యాధి రాకుండా ఉంటుంది.

*6. మన శరీరంలోకి విషవ్యర్థాలు, సూక్ష్మ క్రిములు, బ్యాక్టీరియాను రాకుండా చేసే పాలీఫెనాల్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌ వంటివి అంజీరలో చాలా ఉంటాయి.

*7. అంజీర తింటే మలబద్ధకం సమస్య వదిలిపోతుంది. ఇది మలబద్ధకం సమస్యల్ని వంద శాతం నయం చేస్తుందని పరిశోధనల్లో తేలింది. మలబద్ధకం లేనివాళ్లు ఎక్కువ అంజీర పండ్లు తినకూడదు.

*8. మతిమరపు, అల్జీమర్స్‌ వంటివి రాకుండా అంజీర దోహదపడుతుంది.

*9. గొంతులో నొప్పి, మంట, వాపు వంటివి ఉంటే నెమ్మదిగా నములుతూ అంజీర తినాలి. వీటిలోని ముసిలేజ్‌ పదార్థం ఈ సమస్యలను నివారిస్తుంది.

*10. పచ్చివి లేదా డ్రై అంజీరలను ప్రతిరోజూ తీసుకుంటే చర్మం, జుట్టు అందంగా ఉంటాయి.

*11. ఆస్తమా, దగ్గు, జ్వరం లాంటి చాలా అనారోగ్య సమస్యలకు ఈ పండ్లు చెక్‌ పెడతాయి.

No comments

Powered by Blogger.