Latest

Loading...

AP News జగన్ సర్కార్ సంచలన నిర్ణయం..!


 తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదం రోజు రోజుకు ముదురుతోంది. ఇరు రాష్ట్రాల పరస్పర లేఖలు, ఫిర్యాదులతో పరిస్థితి మరింత హీట్ పుట్టిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ వివాదంపై సుప్రీం కోర్టుకు వెళ్లే యోచనలో ఏపీ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. సుప్రీంలో పిటిషన్ కు కసరత్తు చేస్తోంది. అంతర్ రాష్ట్ర పరిధిలో ఉన్న ప్రాజెక్టులను, విద్యుత్ కేంద్రాలను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించడంతో పాటు నిర్వాహణ, భద్రత బాధ్యతలను కేంద్ర బలగాలకు అప్పగిచాలని సుప్రీంను ఏపీ ప్రభుత్వం కోరనుంది.


నిర్దేశించిన వాటాల కంటే అధికంగా నీటిని అక్రమంగా వాడుకోవడం, ఆ ఒప్పందాలను ఉల్లంఘించేలా కొత్త ప్రాజెక్టులు కట్టడం, లేదా ఉన్న ప్రాజెక్టుల సామర్థ్యాన్ని విస్తరించడం తదితర అక్రమ చర్యలను ఆపాలంటే ఒక శాశ్వత పరిష్కారం అవసరమని కోర్టుకు నివేదించనున్నట్టుగా అధికారవర్గాలు వెల్లడించాయి.

నదీ జలాల వివాదాలను ఎవరు పరిష్కరించాలన్న విషయాన్ని రాజ్యాంగంలోనే స్పష్టంగా పొందుపరిచారు. రాజ్యాంగం ప్రకారం కేంద్రమే వాటిని పరిష్కరించాలి. కాబట్టి అంతర్రాష్ట్ర నదీ జలాలపై ఉన్న రిజర్వాయర్లు, విద్యుత్‌ కేంద్రాలన్నీ కూడా బోర్డు పరిధిలోనే ఉండాలంటూ పిటిషన్‌ ద్వారా ఏపీ ప్రభుత్వం కోరనున్నట్టు తెలుస్తోంది.


బచావత్‌ అవార్డు ప్రకారం తాగునీరు, సాగునీటి అవసరాలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. సాగు అవసరాల కోసం నీటిని విడుదల చేసినప్పుడు మాత్రమే విద్యుదుత్పత్తి చేయాలి. కేవలం ఒక్క విద్యుత్‌ ఉత్పత్తి కోసమే నీటిని విడుదల చేయరాదన్న విషయాన్ని పిటిషన్‌లో ప్రస్తావించనున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి.


1 comment:

Powered by Blogger.