Bank Exams: బ్యాంక్ ఉద్యోగాల భర్తీకి కేంద్రం బ్రేక్, ఇక తెలుగులోనే ఎగ్జామ్..! సాధ్యమయ్యేనా..?
తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగ యువతకు కేంద్ర ఆర్థిక శాఖ శుభవార్త చెప్పింది.. ఎప్పటి నుంచో వినిపిస్తున్న డిమాండ్ కు కేంద్రం ఓకే చెప్పేందుకు సిద్ధమైంది..? అందుకే తాజగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లరికల్ ఉద్యోగాల భర్తీకి బ్రేక్ పడింది. ప్రాంతీయ భాషల్లో పరీక్షల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకునేంత వరకు పరీక్షలను నిలుపుదల చేయాలంటూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్‌కు (ఐబీపీఎస్) ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల ఇంగ్లిష్, హిందీ భాషల్లో క్లరికల్ క్యాడర్ టెస్ట్ నిర్వహించేందుకు ఐబీపీఎస్ ఇటీవల ప్రకటన వెలువరించింది. ఆన్ లైన్ లో అప్లికేషన్లు కూడా స్వీకరించే ప్రక్రియ ప్రారంభమైంది.
No comments