Benefits of Aloe vera అలోవెరాతో కలిగే ప్రయోజనాలు...తెలుసా...?
అలోవెరా మొక్కకు వారానికి రెండుసార్లు నీరు పోసినా చాలు ఆ మొక్క హాయిగా బతుకుతుంది. అది పెరిగాక దాని నుంచి చాలా పిలకలు వస్తాయి. అందుకే ఈ మొక్క ధర చాలా తక్కువే ఉంటుంది. కానీ దీన్ని మందులు, కాస్మొటిక్ ఉత్పత్తుల్లో ఎక్కువగా వాడుతారు. కలబందలో ఉండే గుజ్జు 96 శాతం నీటితోనే తయారవుతుంది. శతాబ్దాలుగా అలోవెరాను సంప్రదాయ ఔషధ మొక్కగా వాడుతున్నారు. వేడి వాతావరణంలో పెరిగే ఈ మొక్కను మనం నీడలో, ఎండలో ఎక్కడైనా పెంచుకోవచ్చు. అలోవెరాలోని పోషకాలు, ఎంజైములు, అమైనో యాసిడ్లు, ఖనిజాలు ఇవన్నీ అధిక బరువును తగ్గించేవే. ప్రతి రోజూ గ్లాస్ నీటిలో 20 శాతం అలోవెరా గుజ్జును కలిపి తాగేయాలి. అది రుచికరంగా ఉండకపోయినా అలా చెయ్యడం వల్ల ఎంతో మేలు చేస్తుంది.
ఇంటి లోపలే పెంచుకోతగ్గ ఈ మొక్కను అద్భుతమైన మొక్క అంటారు. దీనివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అలోవెరా వల్ల ఉపయోగాలివే: అలోవెరా జుట్టుకు మాస్కులా పనిచేస్తుంది. చుండ్రును పూర్తిగా నయం చేస్తుంది. జుట్టు బాగా పెరిగేందుకు దోహదపడుతుంది. చర్మానికి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. ముఖంపై మచ్చలు, మొటిమలను నయం చేస్తుంది. శరీరానికి మినరల్స్ ను అందిస్తుంది. చర్మంపై గాయాలను మాన్పుతుంది. స్కిన్ కోసుకున్నా, చిట్లినా అలోవెరా రాస్తే తగ్గుతాయి. మేకర్ రిమూవర్ గా పనిచేస్తుంది. ముఖం మెరవడానికి బాగా ఉపయోగపడుతుంది. ముఖంపై మృత కణాలు తొలగిపోతాయి శరీరానికి విటమిన్ సీని ఇస్తుంది. మౌత్ వాష్‌గా పనిచేస్తుంది.
No comments