Latest

Loading...

Benefits of cloves లవంగాలతో కలిగే ప్రయోజనాలు ఎన్నో....!!!

Benefits of cloves

 లవంగాలు వంటకాలకే కాదు, జబ్బుల నివారణకు కూడా బాగా పనిచేస్తాయని నిపుణులు అంటున్నారు.

-లవంగ మొగ్గ, లవంగ నూనె పంటి సమస్యలకు చక్కటి ఔషధాలుగా పనిచేస్తాయి.

- లవంగాలు తీసుకుంటే జీర్ణశక్తి పెరుగుతుంది. ఫలితంగా శరీరంలోని జీవక్రియలు సక్రమంగా జరుగుతాయి.

- లవంగాలు గుండెపోటు రాకుండా నివారించడంలో పరోక్షంగా సహకరిస్తాయి. ఇవి రక్తాన్ని పలుచబరుస్తూ గడ్డ కట్టకుండా నివారిస్తాయి.

- పిప్పి పన్ను నొప్పి పెడుతుందంటే లవంగ మొగ్గను చిదిమి పిప్పి ఉన్న చోట పెట్టాలి. దూదిలో ఒక చుక్క లవంగ నూనెను వేసి, నొప్పి ఉన్న చోట వేస్తే నొప్పి తగ్గుతుంది.

-లవంగ నూనె రక్తప్రసరణను ప్రేరేపిస్తుంది. చర్మకణాలను ఉత్తేజపరుస్తుంది.


లవంగాన్ని మెత్తగా నూరి, మొటిమల మీద రాస్తే, మొటిమ విస్తరించకుండా త్వరగా రాలిపోతుంది. ఇలా రాసేటప్పుడు మొటిమ పక్కన ఉన్న చర్మానికి తగలకుండా జాగ్రత్తపడాలి.

-వాంతి అవుతుందనిపించినప్పుడు లవంగం వాసన చూడాలి. లవంగం రసాన్ని చప్పరించినా ఫలితం ఉంటుంది.

-దగ్గు వదలకుండా బాధిస్తుంటే లవంగం మొగ్గను బుగ్గన పెట్టుకుని మెల్లగా నములుతూ రసం మింగాలి.

-లవంగాలు ఇన్‌ఫెక్షన్ల నివారణలో సహకరిస్తాయి. ఎందుకంటే వీటిలో యాంటీ బాక్టీరియల్‌, యాంటీవైరల్‌, యాంటీ ఫంగల్‌, యాంటీసెప్టిక్‌ గుణాలున్నాయి.

No comments

Powered by Blogger.