Latest

Loading...

Big Saving Days sale : ఈ కామర్స్ సైట్లలో బంపర్ ఆఫర్స్..! ఆలస్యం చేయకండి..!!

Big Saving Days sale

 Big Saving Days sale : జులై చివరి వారంలో దేశ వ్యాప్తంగా ఆఫర్ల మోత మోగనుంది. కస్టమర్లను ఆకర్షించేందుకు ఈ కామర్స్ దిగ్గజ సంస్థలు భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. దేశీయ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ “బిగ్ సేవింగ్ డేస్ సెల్”, అమెరికా సంస్థ అమెజాన్ “ప్రైమ్ డే సేల్ ” ను నిర్వహించనున్నారు. ఈ సేల్ ఏడాదికి ఒకసారి జరుగుతుంది.


ఫ్లిప్ కార్ట్ లో జులై 24 అర్ధరాత్రి నుంచి జులై 29 అర్ధరాత్రి వరకు ఈ సేల్ కొనసాగనుంది. ఇక అమెజాన్ లో జులై 26, 27 తేదీల్లో ప్రైమ్ డే సేల్ నిర్వహించనున్నారు. ఈ రెండు సంస్థలు తమ ప్రైమ్, ప్లస్ కస్టమర్లకు భారీ డిస్కౌంట్ ఇస్తున్నాయి. 18 నుంచి 24 ఏళ్ల మధ్య గల యువకులకు అమెజాన్ ప్రైమ్ సభ్యత్వ ఆఫర్లను కూడా ప్రకటించింది.

అమెజాన్ లో సభ్యత్వం కోసం ఏడాదికి రూ.999 చెల్లించాలి. మూడు నెలలకైతే రూ.329 ఉంటుంది. ఇక 18 నుంచి 24 మధ్య వయసు వారికి ప్రైమ్ సభ్యత్వం కోసం 50 శాతం రాయితీ ఇస్తుంది అమెజాన్.


ఇక ఈ రెండు ఈ కామెర్స్ సంస్థలు ఇస్తున్న డిస్కౌంట్లను ఓసారి పరిశీలిస్తే


ఫ్లిప్ కార్ట్


ఐఫోన్ XR


ఐఫోన్ XR 64 జీబీ మోడల్ ధర మార్కెట్లో రూ.45,000 వరకు ఉంది. కానీ ఫ్లిప్ కార్ట్ సేల్ లో దీని ధర రూ. 37,999గా ఫిక్స్ చేశారు. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ద్వారా తీసుకునే వారికి మరో 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ డిస్కౌంట్.. ఐసీఐసీఐ క్రిడిట్ కార్డు డిస్కౌంట్ రెండు కలిపితే దీని ధర రూ.10వేల వరకు తగ్గుతుంది.

శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 62


శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 62 ధర మార్కెట్లో రూ.22,000గా ఉంది. ఫ్లిప్ కార్ట్ ఆఫర్ లో రూ.19,999 అందిస్తుంది. ఇక ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ద్వారా మరో 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు.

గూగుల్ పిక్సెల్ 4ఏ


ఈ ఫోన్ ఫ్లిప్ కార్డు బిగ్ సేవింగ్ సేల్ లో రూ.29,999 లభిస్తుంది. దీనికి కూడా ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు డిస్కౌంట్ వర్తిస్తుంది.

పోకో ఎం3


పోకో ఎం3 స్టార్ట్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ సేల్ లో రూ. 10,499కే లభిస్తుంది. దీనికి కూడా ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు డిస్కౌంట్ వర్తిస్తుంది.

అమెజాన్


అమెజాన్ MI, వన్ ప్లస్, ఫోన్స్ పై భారీ డిస్కౌంట్ ఇస్తుంది. MI10 5g ఫోన్ పై 12 నెలల నో కాస్ట్ ఈఎంఐని ప్రకటించింది. ఇక ఇందులోని కొన్ని మోడల్స్ కి స్క్రీన్ రీప్లేస్మెంట్ ఆఫర్ ఇచ్చింది. ఈ ఫోన్ 108 క్వాడ్ కెమెరా కలిగి 750 ఆక్టా కోర్ ప్రాసెసర్ ను కలిగి ఉంటుంది

.

OnePlus Nord 2 5G ఫోన్ పై రూ.1000 డిస్కౌంట్ ఇస్తుంది అమెజాన్.. ఇక అంతేకాకుండా అమెజాన్ తెలిపిన క్రెడిట్ కార్డు ఉపయోగించి కొనుగోలు చేస్తే డిస్కౌంట్ ఇస్తుంది. Xiaomi Redmi Note 10T ఫోన్ రూ.13,999 లభిస్తుంది. ఏదైనా అమెజాన్ తెలిపిన క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 5 నుంచి 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది

మొబైల్ పైనే కాకుండా ఎలక్ట్రికల్ వస్తువులు, గృహోపకరణాలపై కూడా ఈ రెండు ఈ కామెర్స్ సంస్థలు భారీ డిస్కౌంట్స్ ఇస్తున్నాయి. అయితే కేవలం, ప్రైమ్, ప్లస్ మెంబెర్ షిప్ ఉన్నవారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇతరులకు ఆఫర్ వర్తించదని ఈ రెండు సంస్థలు తెలిపాయి.

No comments

Powered by Blogger.