Latest

Loading...

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త....!!

Good news

 కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు.. మోడీ సర్కార్‌ తీపికబురు చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంచుతూ కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 17 శాతం నుంచి 28 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది కేంద్రం. 7వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు ఈ డీఏను పెంచింది కేంద్రం.


పెంచిన ఈ డీఏను 2021 ఏడాది మొదటి నెల నుంచి అమలు చేయనున్నట్లు సమాచారం అందుతోంది. ఇక పెంచిన ఈ డీఏ కారణంగా సుమారు 54 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.


ఇది ఇలా ఉండగా… 2020 జనవరి నుంచి డీఏ పెంపు పెండింగ్‌లో ఉంది. ఇప్పటికే మూడు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి.


మరోవపు 2021 జులై నుంచి కొత్త డీఏను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై పడింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ సారి డీఏ పెంచేందుకే నిర్ణయం తీసుకుంది. మరోవైపు పెన్షనర్లకు సంబంధించి డీఆర్‌ పెంపుపై ఎలాంటి ప్రకటన చేయలేదు కేంద్రం.

No comments

Powered by Blogger.