Blood Clot: వ్యాక్సిన్ తీసుకున్నవారిలో రక్తం గడ్డకట్టడానికి ఆ పొరపాటే కారణం.....తాజా అధ్యయనం ఏం చెప్పిందంటే....?
కరోనా కట్టడిలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా వ్యాక్సిన్ తీసుకున్న కొందరిలో రక్తం గడ్డకట్టిన ఘటనలు వెలుగులోకి రావడం ఆందోళ కలిగించింది. స్ట్రాజెనికా, జే అండ్ జే, స్పుత్నిక్ టీకాలు తీసుకున్న కొందరిలో ఈ రకమైన కేసులు నమోదయ్యాయి. వీటిని అడెనో వైరస్ ఆధారంగా ఈ వ్యాక్సిన్లను తయారు చేశారు. అయితే తాజాగా వ్యాక్సిన్ తీసుకున్న కొందరిలో రక్తం గడ్డకట్టడానికి గల కారణాలపై పరిశోధకులు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. రక్తం గడ్డకట్టడానికి గల కారణాలను తాజా అధ్యయనంలో వివరించారు. జర్మనీలోని మ్యూనిచ్ యూనివర్సిటీ క్లినిషీయన్ శాస్త్రవేత్తలు, ఇటలీలోని ఓ పరిశోధన సంస్థ కలిసి ఈ అధ్యయనం చేపట్టాయి.
సరైన రీతిలో ఇంజక్షన్ వేయకుంటే.. దాని వల్ల రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉన్నట్లు ఈ అధ్యయనం పేర్కొంది. జర్మనీ, ఇటలీలో ఎలుకలపై నిర్వహించిన అధ్యయనం ఆధారంగా ఈ విషయాన్ని వెల్లడించింది. నేరుగా రక్తనాళాల్లోకి టీకాలను ఇవ్వడం వల్ల.. ఇలాంటి అరుదైన సమస్య వస్తుందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. ప్రమాదవశాత్తు టీకాలను నేరుగా రక్తనాళాల్లోకి ఎక్కించడం వల్ల త్రాంబాటిక్ త్రాంబోసైటోపెనిక్ సిండ్రోమ్ (టీటీఎస్) లక్షణాలు కనిపించే అవకాశం ఉందని ఈ అధ్యయనంలో ప్రధానంగా ప్రస్తావించారు.
కోవిడ్‌పై ఏర్పాటు చేసిన ఐఎంఏ నేషనల్ టాస్క్‌పోర్స్‌లో సభ్యుడైన డాక్టర్ రాజీవ్ జయదేవన్(Dr. Rajeev Jayadevan) దీని గురించి వివరిస్తూ.. 'ఇంజెక్లన్ చేసేటప్పుడు ఒకవేళ సూది కొన కండరాలలో తగినంత లోతుకు చేరుకోకపోయినా, అది రక్త నాళానికి తగిలిన.. వ్యాక్సిన్ నేరుగా రక్త ప్రవాహంలోకి ప్రవేశిస్తుంది. తగినంత శిక్షణ లేని ఆరోగ్య కార్యకర్త చర్మం మీదనే ఇంజక్షన్ గుచ్చినట్టయితే ఇలా జరిగే అవకాశం ఉంటుంది'అని చెప్పారు.
No comments