Latest

Loading...

Calories Count మీరు తీసుకునే ఆహారంలో ఎన్ని కేలరీస్ ఉన్నాయో ఇలా చెక్ చేయండి....!

Calories count

 ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్య కరోనా పుణ్యమా అని పెరిగిందనే చెప్పాలి. లాక్ డౌన్ కారణం గా వర్క్ ఫ్రం హోం వల్ల ఎక్కువ సమయం కంప్యూటర్ ముందు కూర్చుని చాలా మంది బరువు పెరుగుతున్నట్టు పరిశోధనల్లో తేలింది. అయితే మీరు కూడా మీ బరువు ఎందుకు పెరుగుతున్నారో..? దానికి ఏమి తినాలో.. ఏమి వద్దో.. ఏ ఆహార పదార్థాల్లో ఎన్ని కేలరీస్ ఉన్నాయో చెక్ చేసుకోవడం ముఖ్యం.

కేలరీస్ లెక్కలు ఇవే.

1. ఒక ప్లేట్ రైస్ లో 262 కేలరీస్ ఉంటాయి.

2. ఒక చపాతి లో 60 కేలరీస్ ఉంటాయి.

3. ఒక కప్పు పాలలో రెండు స్పూన్ల పంచదార కలిపితే 36 కేలరీస్ ఉంటాయి.

4. మీడియం సైజ్ పూరీకి 125 కేలరీస్ ఉంటాయి.
ఎన్ని పూరీలు తింటే అన్ని కేలరీస్ పెరుగుతాయి.

5. బాగా నెయ్యి వేసి చేసే పాయసం అంటే మనలో చాలా మందికి ఇష్టం. అయితే ఒక కప్పు పాయసం తింటే 369 కేలరీస్ వచ్చి చేరతాయి.

6. ఒక చిన్న కప్పు బంగాళదుంప కూరలో 123 కేలరీస్ ఉంటాయి.

7. ఈ మధ్య ప్రతి ఒక్కరు పరోటా తీసుకుంటున్నారు. అయితే ఒక మీడియం సైజ్ పరోటా లో 210 కేలరీస్ ఉంటాయి.

8. భోజనానికి భోజనానికి మధ్యలో తీసుకునే స్నాక్స్ లో 550 నుండి 600 కేలరీస్ ఉంటాయి.

ఈ కేలరీల లెక్కలు తెలుసుకుని చాలా మంది కంగారు పడుతుంటారు. అయితే వర్క్ ఫ్రం హోం లో స్నాక్స్ ని ఎవైడ్ చేయడం ఉత్తమం. మితంగా ఆహారాన్ని తీసుకుని "శారీరక శ్రమ" చేస్తుండడం వల్ల.. అంటే అప్పుడప్పుడు బ్రేక్ తీసుకుని చిన్న చిన్న వర్కౌట్స్ చేస్తుండాలి. లేదా వీలున్నప్పుడల్లా వాకింగ్ చేయడం ద్వారా అధిక బరువు నుండి తప్పించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

No comments

Powered by Blogger.