Capcicum Health Benefits : క్యాప్సికం గురించి అసలు నిజం తెలిస్తే...అసలు వదిలిపెట్టరు.
Capsicum Health Benefits :క్యాప్సికం ఒకప్పుడు అన్ని చోట్ల విరివిగా దొరికేది కాదు. కానీ ఇప్పుడు అన్ని చోట్ల బాగా దొరుకుతుంది. క్యాప్సికం ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగులలో ఎక్కువగా దొరుకుతుంది. క్యాప్సికం పచ్చిమిర్చి మాదిరిగా ఘాటు లేకుండా ఎక్కువ పోషకాలతో మంచి రుచిగా ఉంటుంది. క్యాప్సికం లో విటమిన్ ఏ, సి ,ఇ పుష్కలంగా ఉండటం వలన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో శరీరంలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఉంది. కంటి ఆరోగ్యాన్ని కాపాడి కంటి చూపు బాగా ఉండేలా చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన గర్భాశయ, క్లోమగ్రంథి క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది.
బరువు తగ్గాలి అనే ప్రణాళికలో ఉన్నవారికి క్యాప్సికం మంచి ఎంపిక అని చెప్పవచ్చు.
శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించే బరువు తగ్గేలా చేస్తుంది. యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన ఫంగల్ ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. శ్వాససంబంధ సమస్యలు లేకుండా చేయడమే కాకుండా గొంతు నొప్పి, దగ్గు వంటి వాటిని తగ్గిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారికి కూడా క్యాప్సికం మేలు చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది.
క్యాప్సికంలో ఉండే విటమిన్ సీ.. కొల్లజన్ ను ఉత్పత్తి చేస్తుంది. దీంట్లో ఉండే విటమిన్ కే.. రక్త కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎముకల మధ్య జాయింట్స్ ను ధృడంగా ఉంచుతుంది. దాంతో కీళ్లనొప్పులు,మోకాళ్ళ నొప్పుల నుండి మంచి ఉపశమనం కలుగుతుంది. ప్రస్తుతం అన్నీ సీజన్ లలోనూ క్యాప్సికం విరివిగా లభ్యం అవుతుంది. కాబట్టి క్యాప్సికం తిని ఇప్పుడు చెప్పిన అన్నీ ప్రయోజనాలను పొందండి.
No comments