Child Aadhaar : ఇలా చేయకుంటే.. మీ పిల్లల ఆధార్ కార్డు పనిచేయదు.. చెక్ చేశారా..?
Aadhaar card your child : మీ పిల్లాడికి ఆధార్ కార్డు ఉందా? 5 ఏళ్లు నిండాయా? అయితే వెంటనే బయోమెటిక్స్ అప్ డేట్ చేయించండి. లేదంటే ఆధార్ పనిచేయకపోవచ్చు. ఐదేళ్ల లోపు చిన్నారులకు ఇచ్చే ఆధార్ కార్డులో బయోమెట్రిక్స్ ఉండవు. ఐదేళ్ల తర్వాత బయోమెట్రిక్స్ తీసుకోవడం తప్పనిసరి.. అలాగే 15ఏళ్ల వయస్సులో ఒకసారి బయోమెట్రిక్స్ అప్ డేట్స్ చేసుకోవాల్సి ఉంటుంది. పిల్లల్లో ఆధార్ కార్డు బయోమెట్రిక్స్ అప్ డేట్ ఉచితమే. దీనికి ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన పనిలేదు.
మీరు చేయాల్సిందిల్లా.. మీకు దగ్గరలోని #AadhaarEnrolment Centre వెళ్లండి. లేదా https://appointments.uidai.gov.in/easearch.aspx విజిట్ చేయొచ్చునని UIDAI ఒక ప్రకటనలో పేర్కొంది.
No comments