Latest

Loading...

Chips Side effects. చిప్స్ తింటున్నారా....ఈ విషయం తెలిస్తే జీవితంలో చిప్స్ తినరు..!!

Chips Side effects

 Chips Side effects in telugu : మనలో చాలా మందికి చిప్స్ అంటే చాలా ఇష్టంగా తింటారు. చిప్స్ ఒకసారి అలవాటు అయితే మానటం కూడా చాలా కష్టం .ప్రతి రోజు చిప్స్ తింటే ఏరి కోరి అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టే.అదేపనిగా చిప్స్ తింటూ ఉంటే ఆరోగ్యానికి మంచిది కాదనిఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.


వారానికి ఒకసారి తింటే పర్లేదు కానీ అదే పనిగా తింటే మాత్రం హానికరం అని అంటున్నారు.అదేపనిగా నూనెలో వేగించిన స్నాక్స్‌ను తీసుకుంటే ఎన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలుసుకుందాం.


నూనెలో వేగించిన ఆహారాలలో ఎటువంటి పోషకాలు ఉండవు.నూనెలో వేగించటం వలన వాటిలో ఉండే పోషకాలు నశిస్తాయి.అందువల్ల ఈ ఆహారాలకు బదులు సలాడ్స్ తింటే మంచిది.


చిప్స్ లో హైఫ్యాట్ కెలోరీలు ఉండుట వలన అదే పనిగా తింటూ ఉంటే అధిక బరువు పెరిగి ఊబకాయానికి దారి తీస్తుంది.


ముఖ్యంగా బంగాళాదుంప చిప్స్ ద్వారా ఈ సమస్య అధికం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


చిప్స్ లో సోడియం అధిక మొత్తంలో ఉండుట వలన రక్తపోటు పెరుగుతుంది.


దాంతో గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది.


రోజూ బంగాళాదుంప చిప్స్ తింటూ ఉంటే హై కొలెస్ట్రాల్ తప్పదు.


డీప్- ఫ్రై చేయడం ద్వారా చిప్స్‌లో ట్రాన్స్‌ఫాట్ పెరుగుతుంది.ఇది ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.


వేగించిన ఆహారాలలో ట్రాన్స్ ఫాట్స్ ఎక్కువగా ఉంటాయి.ఇవి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయుల్ని పెంచుతాయి.


అందువల్ల చిప్స్ కి బదులుగా ఉడికించిన ఆహారాలను తీసుకుంటే మంచిది.


గోధుమలతో చేసిన వంటకాలు, మొక్కజొన్నతో చేసిన స్నాక్స్ వంటివి లో కెలోరీలను కలిగివుంటాయి.


కూరగాయలతో చేసిన సలాడ్స్, సాండ్‌విజ్‌లు తీసుకున్నా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

No comments

Powered by Blogger.