Latest

Loading...

CM Jagan : సీఎం జగన్ తీపికబురు....ఆగస్టులో వారి ఖాతాల్లో డబ్బులు....!!

CM Jagan

 CM Jagan : స్పందన కార్యక్రమంపై ఏపీ సీఎం జగన్ మంగళవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్‌ బాధితులకు ఊరటనిచ్చే వార్త చెప్పారు. రూ.20వేల లోపు డిపాజిట్‌ చేసిన అగ్రిగోల్డ్‌ బాధితులకు ఆగస్టు 24న చెల్లింపులు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇక ఆగస్టు నెలలో అమలయ్యే సంక్షేమ పథకాల గురించి సీఎం జగన్ ప్రస్తావించారు. ఆగస్టు 10న నేతన్న నేస్తం, 16న విద్యాకానుక అందించనున్నట్టు సీఎం చెప్పారు. అలాగే ఎంఎస్‌ఎంఈలకు, స్పిన్నింగ్‌ మిల్స్‌కు ఆగస్టు 27న ఇన్సెంటివ్‌లు ఇస్తామని.. ఈ మేరకు కలెక్టర్లు సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు సీఎం జగన్.


నేతన్న నేస్తం కింద సొంత మగ్గం ఉన్న చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా ఇస్తోంది ప్రభుత్వం.


సొంత మగ్గం ఏర్పాటు చేసుకున్న వారికే నేతన్న నేస్తం పథకాన్ని వర్తింప జేసింది ప్రభుత్వం. ఈ పథకం కింద ఏడాదికి రూ.24 వేలు సాయం అందిస్తోంది. ఇప్పటికే రెండు విడతలుగా రూ.24 వేల చొప్పున అందించింది. మూడో విడత సాయానికి ప్రభుత్వం సిద్ధమైంది.


రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 10వ తరగతి విద్యార్థులందరికీ అవసరమైన సామాగ్రిని ఉచితంగా అందజేసే పథకం జగనన్న విద్యాకానుక. జగనన్న విద్యా కానుక కిట్‌లో విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలతో ఇతర వస్తువులను పొందుపరిచారు. ఈ కిట్లలో 3 జతల యూనిఫారాలు(క్లాత్‌), ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, ఒక సెట్‌ పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, స్కూల్‌ బ్యాగ్‌, డిక్షనరీ ఉంటాయి.


గ్రామ, వార్డు సచివాలయాలను ఓన్‌ చేసుకోవాలని, వీటి సమర్థత మెరుగుపడాలంటే తనిఖీలు జరగాలని సీఎం జగన్‌ అన్నారు. కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లు, ఐటీడీఏ పీవోలు, సబ్‌కలెక్టర్లు తనిఖీలు చేయాలని జగన్ ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాలను కలెక్టర్లు, జేసీలు బాగానే తనిఖీలు చేశారని, ఇతర అధికారులు కూడా తరచూ తనిఖీ చేయాలని సీఎం జగన్ సూచించారు. ఐటీడీఏ పీవోలు 18 శాతం, సబ్‌ కలెక్టర్లు 21 శాతం తనిఖీలు చేశారని చెప్పారు. అయితే, సరిగా తనిఖీలు చేయని వారికి నోటీసులు జారీ చేయాలని సీఎం ఆదేశించారు. తనిఖీ చేయకపోతే క్షేత్రస్థాయి సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. 'మొదట మనుషులం.. ఆ తర్వాతే అధికారులం' అని సీఎం జగన్ అన్నారు. వచ్చే స్పందన నాటికి నూరుశాతం పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా అర్హులకు పథకాలు అందించాలన్నారు. రెండు శాతం గ్రామ, వార్డు సచివాలయాల్లో హాజరు గణనే ఉండట్లేదన్నారు.


”వారానికి రెండు సార్లు కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు 4 సార్లు, మున్సిపల్‌ కమిషనర్లు, ఐటీడీఏ పీఓలు, సబ్‌ కలెక్టర్లు వారానికి 4 సార్లు గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శించమని చెప్పాం. 733 తనిఖీలు మాత్రమే జరిగాయ. 66.75శాతం మాత్రమే తనిఖీలు చేశారు. కలెక్టర్లు 106 శాతం, జేసీలు ( గ్రామ సచివాలయాలు) 107 శాతం ఇన్ స్పెక్షన్లు చేశారు. వీరంతా బాగానే ఇన్ స్పెక్షన్లు చేశారు. కాని మిగిలిన వారు సరిగ్గా చేయలేదు. జేసీ రెవిన్యూ 78శాతం, జేసీ హౌసింగ్ 49శాతం, జేసీ ( ఏ అండ్‌ డబ్ల్యూ) 85శాతం, కార్పొరేషన్లలో మున్సిపల్‌ కమిషనర్లు 89శాతం, ఐటీడీఏ పీఓలు 18శాతం, సబ్‌ కలెక్టర్లు 21శాతమే ఇన్ స్పెక్షన్లు చేశారు. వీరి ఫెర్మానెన్స్‌ చాలా బ్యాడ్‌గా ఉంది. వీరికి మెమోలు జారీచేయమని ఆదేశాలు జారీ చేశాను. వీరు తనిఖీలు చేయకపోతే క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు ఎలా తెలుస్తాయి. సకాలంలో పెన్షన్లు వస్తున్నాయా? రేషన్‌కార్డులు వస్తున్నాయా? లేదా అని ఎవరికి తెలుస్తుంది. మనం వెళ్లకపోతే ఎలా తెలుస్తాయి. తప్పులు జరిగాయని తెలిస్తే.. వాటిని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. అసలు వెళ్లకపోతే.. ఎలా తెలుస్తాయి?” అని సీఎం జగన్ అన్నారు.


”బియ్యం కార్డు, పెన్షన్‌ కార్డు, ఇళ్లపట్టాలు, ఆరోగ్యశ్రీ పథకాలు అత్యంత ముఖ్యమైనవి. నిర్దేశించుకున్న సమయంలోగా అర్హులకు అవి అందాలి. ప్రతి అర్హుడికీ ఇవి అందాలి. మనకు ఓటు వేయని వారికి కూడా అందాలి. అనర్హులకు అందకూడదు. వీటిని స్వయంగా పరిశీలించాలి, పర్యవేక్షణ, సమీక్ష చేయాలి. గ్రామ, వార్డు సచివాయాలను సందర్శించి వెరిఫికేషన్‌ ప్రాసస్‌ సరిగ్గా జరుగుతుందా? లేదా? చూడాలి. ఏమైనా లోపాలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలి. వెంటనే సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. మీరే మాకు కళ్లు, చెవులు, మీరే మా బలం. అందుకనే మీరు క్షేత్రస్థాయికి వెళ్లి.. పరిశీలనలు చేయాలి” అని జగన్ అన్నారు.

No comments

Powered by Blogger.