Latest

Loading...

Covid Delta Variant : డెల్టా వెరీ డేంజరస్.. అల్ఫా కంటే 60శాతం వేగంగా వ్యాపించగలదు...!!

,Covid Delta Variant

 COVID-19 Delta Variant
: ప్రపంచాన్ని వణికిస్తోన్న డెల్టా వేరియంట్.. అన్ని వేరియంట్ల కంటే అత్యంత ప్రమాదకరంగా మారుతోంది. ఆల్ఫా వేరియంట్ (Alpha Variant) కంటే డెల్టా వేరియంట్ 40 నుంచి 60 శాతం వేగంగా వ్యాపించగలదని జాతీయ నిపుణుల కమిటీ ఒక ప్రకటనలో వెల్లడించింది. B.1.617.2 వేరియంట్ గా పిలిచే Delta Variant.. మొదటిసారిగా అక్టోబర్ 2020లో భారత్ లో కనిపించింది. సెకండ్ వేవ్ వ్యాప్తిలో 80 శాతం కొత్త కోవిడ్ కేసులు డెల్టా వేరియంట్ కారణంగానే నమోదైనట్టు గుర్తించారు.


ఇప్పటికే అల్ఫా వేరియంట్.. యూకే, యూఎస్ఏ, సింగపూర్ సహా 80 దేశాల్లో ఇప్పటికే వ్యాపించింది. అయితే ఈ అల్ఫా కంటే డెల్టా వేరియంట్ అత్యంత వేగంగా వ్యాపిస్తుందని నిపుణుల కమిటీ అంచనా వేసింది.


ఈ డెల్టా వేరియంట్ మ్యుటేషన్.. తన స్పైక్ ప్రోటీన్ ను ACE2 రిస్పెటర్ సాయంతో మరింత వేగంగా వ్యాపించలదు. అలాగే శరీరంలోకి ప్రవేశించాక రోగనిరోధక వ్యవస్థపై దాడి చేస్తుందని గుర్తించారు.


అంతేవేగంగా శరీరంలోని ఊపిరితిత్తులు సహా పలు అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని గుర్తించారు. డెల్టా ప్లస్ వేరియంట్ కు కారణమయ్యే AY.1, AY.2 వాటితో దేశవ్యాప్తంగా మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్ సహా 11 రాష్ట్రాల్లో 55 నుంచి 60 కేసులు నమోదయ్యాయి. AY.1 వేరియంట్.. నేపాల్, పోర్చుగల్, స్విట్జర్లాండ్, పోలాండ్, జపాన్ దేశాల్లో కనిపించింది. ప్రస్తుత కరోనా వ్యాక్సిన్లు ఈ డేల్టా వేరియంట్ పై సమర్థవంతంగానే పనిచేస్తున్నాయని ఐసీఎంఆర్ అధ్యయనం తెలిపింది.

No comments

Powered by Blogger.