Latest

Loading...

Covid Hair Loss : కరోనాతో బాధితుల్లో తీవ్రంగా జుట్టు రాలిపోతుందట.. ..!!


 Hair Loss Complaints Among COVID Patients 

కరోనా బాధితుల్లో జుట్టు రాలే సమస్య తీవ్రస్థాయిలో పెరిగిపోతుందట. ఇప్పటివరకూ 100 శాతం వరకు కేసులు పెరిగాయని ఢిల్లీ ఇంద్రప్రస్థ అపోలో ఆస్పత్రి వైద్యులు ఒక ప్రకటనలో వెల్లడించారు. సాధారణంగా సౌత్ ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వారానికి నాలుగు నుంచి ఐదు వరకు జుట్టు రాలిపోతుందంటూ వస్తున్నారట.. జుట్టు రాలిపోయే సమస్య ఎదుర్కోనే వారి సంఖ్య మే మధ్య నెల నుంచి మొదలయ్యాయని, రిపోర్టులు చెబుతున్నాయి. అప్పటినుంచి క్రమంగా రెట్టింపు సంఖ్యలో ఈ హెయిర్ లాస్ కేసులు పెరిగిపోయాయని ప్రతినిధి ఒకరు వెల్లడించారు. సాధారణంగా కరోనా నుంచి కోలుకున్న బాధితుల్లో నెల తర్వాత నుంచి వారిలో జుట్టు రాలడం సమస్య మొదలవుతోంది.


కొన్ని సందర్భాల్లో కరోనా ఇన్ఫెక్షన్ కొనసాగుతున్నవారిలోనూ జుట్టు రాలే సమస్యను గమనించినట్టు వైద్యులు చెబుతున్నారు.


తాత్కాలికమా? శాశ్వత సమస్యా? :

ఆహారపు అలవాట్లలో తేడా ఉన్నా కూడా జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు వస్తుంటాయి. వైరస్ సోకి జ్వరంగా ఉన్నప్పుడు, ఒత్తిడి, ఆందోళన, అకస్మాత్తుగా హార్మోన్లు మారిపోయినా కూడా ఇదే సమస్య కనిపిస్తుంటుంది. కరోనా నుంచి కోలుకున్నవారిలోనూ అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అందులో తాత్కాలికంగా జుట్టు కోల్పోవడం వంటి సమస్యలు ఉన్నాయని గుర్తించారు. రెండింతల స్థాయిలో ఈ తరహా కేసులు పెరిగాయని కాస్మిటిక్, ప్లాస్టిక్ సర్జరీ సీనియర్ కన్సల్టెంట్ Dr Shahin Nooreyezdan ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా తర్వాతి కేసులే ఎక్కువగా ఉన్నాయని అన్నారు. పోషకాహార లోపం, బరువు తగ్గిపోవడం, హార్మోన్లలో వ్యత్యాసం, విటమిన్ డి తగ్గిపోవడం, B12 స్థాయిలు కూడా పడిపోవడం వంటి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.


దీని కారణంగానే హెయిర్ కోల్పోవడం వంటి సమస్యలను అధికంగా పెరుగుతున్నాయని డాక్టర్ షాహిన్ తెలిపారు. కరోనా సోకి తగ్గిన తర్వాత చాలామందిలో జుట్టు ఊడిపోవడం అనేది సహజంగా జరిగేది.. దీన్నే Telogen Effluvium అని పిలుస్తారు. కరోనా లక్షణాల్లో జ్వరంతో బాధపడిన తర్వాత శరీరంలో కలిగే మార్పులతో జుట్టు కోల్పోవడం సమస్య రావొచ్చునని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా ఒక వ్యక్తి రోజుకు 100 వెంట్రుకలను కోల్పోవచ్చు. కానీ, Telogen Effluvium సమస్య ఉంటే మాత్రం రోజుకు 300 నుంచి 400 వరకు జుట్టును కోల్పోయే అవకాశం ఉందని ఆయన తెలిపారు.


కరోనా నుంచి కోలుకున్నాక :

కరోనా నుంచి కోలుకున్నాక చాలామందిలో పోషకాహారం లోపం ఎదురువుతుంది. అలాగే సహజంగా లభించే విటమిన్లలో ఐరన్ లోపం కూడా జుట్టు కోల్పోయే సమస్యకు కారణం కావొచ్చు. ఐరన్ లోపం కారణంగా హెయిర్ లాస్ పెరిగే అవకాశం ఉంది. ప్రొటీన్ రిచ్ బ్యాలెన్సడ్ డైట్ ద్వారా జుట్టు రాలే సమస్యను అధిగమించవచ్చునని పోషక నిపుణులు సూచిస్తున్నారు. ఐదు నుంచి ఆరు వారాలుగా పోషకాహారం తీసుకున్నప్పటికీ జుట్టు రాలే సమస్య తగ్గకపోతే వెంటనే వైద్యున్ని సంప్రదించాలని సూచిస్తున్నారు.


*తేలికపాటి, పారాబెన్, సల్ఫేట్ లేని షాంపూలను ఉపయోగించాలి.

*నెత్తి మీద దురద, పొరలుగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి.

*తలకు నూనె రాస్తుండాలి. మసాజ్ చేస్తుండాలి.

 పెద్ద దువ్వెన ఉపయోగించాలి.

– బట్టతల ప్యాచ్, ఎక్కువగా జుట్టు రాలడం కనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.

– ఒత్తిడిని నివారించండి, ధ్యానం చేయండి. ఆరోగ్యకరమైన పదార్థాలనే తినండి.

– సహజ పోషక పదార్ధాలు తీసుకోండి.. కేశాలంకరణకు వేడి, కెమికల్స్ నివారించండి.

No comments

Powered by Blogger.