Diabetes And Egg డయాబెటిస్ ఉన్నవారు గుడ్డు తినవచ్చా. తింటే ఏమవుతుందో తెలుసా...?
Diabetes And Egg :డయాబెటిస్ ఉన్నవారు ఖచ్చితంగా ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఒకసారి డయాబెటిస్ వచ్చింది అంటే కచ్చితంగా జీవితకాలం మందులు వాడాల్సిందే అలాగే ఆహారం విషయంలో కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టాలి.డయాబెటిస్ ఉన్న వారు ఏది తినాలన్న ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తూ ఉంటారు.
డాక్టర్ చెప్పిన సూచనలను తప్పనిసరిగా పాటించాలి. చాలామందికి గుడ్డు తినవచ్చా లేదా అనే సందేహం ఉంటుంది. అయితే గుడ్డు తినొచ్చు అని నిపుణులు అంటున్నారు ఇటీవల కాలంలో జరిగిన పరిశోధనల్లో డయాబెటిస్ ఉన్నవారు కోడి గుడ్డు తింటే మంచిది అని తెలిసింది. ప్రతి రోజు కోడి గుడ్డు తినడం వలన గుండెజబ్బుల ప్రమాదం తగ్గుతుంది. కోడి గుడ్డు లో ఎన్నో పోషకాలు ఉన్నాయి.
గుడ్డులో ఉండే ప్రోటీన్స్ సూక్ష్మ పోషకాలు డయాబెటిస్ ఉన్నవారికి చాలా బాగా సహాయపడతాయి. ఉడికించిన కోడి గుడ్డు తింటే మంచిది.
No comments