Dragon fruit Benefits. : రోజు చిన్న ముక్క తింటే.డాక్టర్ అవసరం ఉండదు .ఎన్నో ప్రయోజనాలు తెలుసా...!!
Dragon fruit Benefits in telugu :డ్రాగన్ ఫ్రూట్ అనేది ఒకప్పుడు మనకు పెద్దగా అందుబాటులో ఉండేది కాదు. ఇప్పుడు విరివిగా లభ్యం అవుతుంది. డ్రాగన్ ఫ్రూట్ కాస్త ఖరీదు ఎక్కువగా ఉన్నా సరే దానికి తగ్గట్టుగా ప్రయోజనాలను కలిగి ఉంటుంది. కాబట్టి డ్రాగన్ ఫ్రూట్ ని తినటానికి ప్రయత్నం చేయండి. డ్రాగన్ ఫ్రూట్ అనేది కాక్టస్ కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయ నామం హైలోసరస్ అండాటస్. డ్రాగన్ ఫ్రూట్ ని పిటాయా, స్ట్రాబెర్రీ పియర్ అని కూడా పిలుస్తారు ఇది రాళ్ళపై లేదా మట్టిలో పెరిగే మొక్క. డ్రాగన్ ఫ్రూట్ మెక్సికో, మధ్య అమెరికా మరియు దక్షిణ అమెరికా దేశాల్లో పెరుగుతుంది. చైనా, వియత్నాం దేశాల నుంచి ఇక్కడికి దిగుమతి అవుతున్నాయి.
ఈ మధ్య కాలంలో భారతదేశంలో కూడా సాగు చేస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్ లో ఎన్ని పోషక విలువలు ఉండటం వలన ఈ ఆమధ్య కాలంలో చాలా ప్రాచుర్యం పొందింది. మార్కెట్ లో ఎక్కువ ధర పలికే డ్రాగన్ ఫ్రూట్ మంజుల రుచి కాళీ ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్ సైజ్ ని బట్టి 200 నుంచి 250 వరకు ధర ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్ లో మూడు రకాలు ఉంటాయి. డ్రాగన్ ఫ్రూట్ మరియు గుజ్జు కూడా ఎరుపుగా ఉండే రకం.
పండు పసుపు పచ్చగా.. గుజ్జు తెల్లగా ఉండే రకం. పండు ఎర్రగా.. గుజ్జు తెల్లగా ఉండే రకం. రంగు ఎలా ఉన్నా పోషకాలు మాత్రం మూడు రకాలలోను ఒకేరకంగా ఉంటాయి. డ్రాగన్ ఫ్రూట్ లో ఉన్న పోషకాలు మన శరీరానికి ఎంతో మేలును చేస్తాయి. ఇప్పుడు ఆ ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం.
డ్రాగన్ ఫ్రూట్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉండుట వలన ఆర్థరైటిస్ (కీళ్ళనొప్పులు) మరియు వాటి వలన కలిగే సమస్యలను తగ్గించటంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఆర్థరైటిస్ కారణంగా వచ్చే తీవ్రమైన చికాకు మరియు అచంచల స్థితి వంటి వాటి నుండి మంచి ఉపశమనం కలిగిస్తాయి. డ్రాగన్ ఫ్రూట్ లో కాల్షియం, పాస్పరస్, ఐరన్, నియాసిన్ మరియు ఫైబర్ లు సమృద్ధిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది.
వీటిలో ఉండే విటమిన్ 'C', మినరల్ మరియు ఫైటో (వృక్ష ఆధారిత) అల్బుమిన్ లు యాంటీ ఆక్సిడెంట్ చర్యలను ప్రేరేపిస్తాయి. డ్రాగన్ ఫ్రూట్ లో ఫైబర్ సమృద్ధిగా ఉండుట వలన తీసుకున్న ఆహారం బాగా జీర్ణం కావటానికి,మలబద్దకం సమస్య తగ్గించటానికి,కడుపు ఉబ్బరం,గ్యాస్ వంటి జీర్ణ సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. జీర్ణాశయం 400 కంటే ఎక్కువ జాతుల బ్యాక్టీరియాలు మరియు 100 ట్రిలియన్ విభిన్న సూక్ష్మజీవులకు నిలయం. ఈ సూక్ష్మజీవులు ఆరోగ్యం మీద ప్రభావం చూపుతాయి.
డ్రాగన్ ఫ్రూట్‌లో ప్రీబయోటిక్స్ ఉండుట వలన జీర్ణాశయంలో మంచి బ్యాక్టీరియా సమతుల్యతను మెరుగుపరచటంలో సహాయపడుతుంది. ప్రీబయోటిక్స్ అనేవి జీర్ణాశయంలో మంచి బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహించే ఒక రకమైన ఫైబర్. కొన్ని అధ్యయనాల ప్రకారం ప్రీబయోటిక్స్ ప్రేగు వ్యాధి మరియు పెద్దప్రేగు క్యాన్సర్ లక్షణాలను తగ్గిస్తుందని తెలిసింది.
No comments