English Teachers : ఏపీలో టీచర్లకు ఇంగ్లీష్‌లో శిక్షణ, 19 నుండి ప్రారంభం...!!
ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు ఇంగ్లీష్ పై పట్టుపెంచే ప్రయత్నం ప్రారంభమైంది. తెలుగు మీడియం విద్యాబోధనకు ఉపాధ్యాయులు పరిమితం కావటంతో ఇంగ్లీష్ లో అంతగా ప్రావీణ్యత కనబరచలేకపోతున్నారు. ఈ క్రమంలో ప్రైమరీ స్ధాయి నుండి హైస్కూల్ స్ధాయి వరకు ఉన్న అన్ని పాఠశాలలో ఉపాధ్యాయులకు ఇంగ్లీష్ మెరుగుపరిచేందుకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. నెల రోజుల పాటు శిక్షణతో కూడిన సర్టిఫికెట్ కోర్సును టీచర్లకు అందించనున్నారు.
ఈ నెల 19 నుండి ఆగస్టు 17 వరకు నెల రోజుల పాటు ఆన్ లైన్ ద్వారా సర్టిఫికెట్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ శిక్షణను అందించనున్నారు. బెంగుళూరుకు చెందిన రీజినల్ ఇన్ స్టిట్యూట్ ఆప్ ఇంగ్లీష్ సంస్ధ ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనుంది.
50సంవత్సరాలలోపు వయస్సున్న
ఉపాధ్యాయులను శిక్షణకు ఎంపిక చేయనున్నారు.
ఈ నెల 5లోపు శిక్షణ తీసుకోనున్న ఉపాధ్యాయుల జావితా తయారు చేయాలని సమగ్ర శిక్ష పిడి వెట్రిసెల్వి ఆదేశించారు. మరోవైపు శిక్షణ తీసుకునే టీచర్లకు అవసరమైన ఇంటర్నెట్ ఇతర సాంకేతిక సదుపాయాలను అందుబాటులో ఉంచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలి విడతగా ప్రతి జిల్లా నుండి 25మంది ఉపాధ్యాయులను ఎంపిక చేయనున్నారు. కొత్తగా ఉపాధ్యాయులుగా నియమితులైన వారికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు.
No comments